పదో తరగతి ఫలితాలపై టీడీపీ పోరాటం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యం వల్లే పెద్ద ఎత్తున పిల్లలు ఫెయిలయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై పోరాటం కొనసాగించేందుకు.. నారా లోకేశ్ నిన్న పదో తరగతి ఫెయిలైన పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టారు. అయితే.. అనుకోకుండా ఆ జూమ్ మీటింగ్‌లోకి మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వైసీపీ నాయకులు వచ్చేశారు. ఒక మాటలో చెప్పాలంటే చొరబడ్డారు.


దీనిపై లోకేశ్‌ తో పాటు టీడీపీ నేతలంతా మండిపడుతున్నారు. తమ నేత జూమ్‌ మీటింగ్‌లోకి వచ్చి అల్లరి చేయడమేంటని విమర్శించారు. అయితే.. తాను ఎందుకు జూమ్ మీటింగ్‌లోకి రావాల్సి వచ్చిందో కొడాలని నాని వివరించారు. అభం శుభం తెలియని పిల్లలకు ఏవేవో చెప్పి  ఆత్మహత్యలను నారా లోకేష్ ప్రేరేపిస్తున్నారని కొడాలి నాని చెబుతున్నారు. అందుకే అలాంటి పనులు చేయవద్దని చెప్పడానికే లోకేష్ జూమ్ మీటింగ్ లో చేరానని మాజీ మంత్రి కొడాలి నాని వివరించారు.


లోకేశ్‌ తప్పు చేస్తున్నందునే.. ఎమ్మెల్యే  వంశీ సహా పలువురు వైసీపీ నేతలు జూమ్ లోకి వెళ్లి లోకేష్ ను ప్రశ్నించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాలపై  లోకేష్ తో  బహురంగంగా చర్చించేందుకు తనకు భయం లేదని మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారు.
అయితే.. తాను తన ఐడీతో  డైరెక్ట్ గా వెళితే లోకేష్ మాట్లాడడు కాబట్టే పిల్లల లింక్ నుంచి జూమ్ మీటింగ్  లోకి వెళ్లానని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు.


తన మేనల్లుడు లింక్ నుంచి నేను లోకేష్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. కరోనా వల్ల రెండేళ్లుగా 8,9 తరగతులు సరిగా జరగలేదని.. ప్రభుత్వ పాఠశాలల్లో  లాప్ ట్యాప్ లు, ఆన్ లైన్ క్లాసులు లేకపోవడం వల్ల పిల్లల స్టాండర్డ్స్ పడిపోయాయని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కరోనా వల్ల  క్లాసులు జరగక పోవడం వల్లే  ఈ సారి పదో తరగతి పిల్లల ఉత్తీర్ణత శాతం తగ్గిందని కొడాలి నాని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: