కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ రోడ్‌ షోలలో జగన్ సర్కారు తీరును ఎండగడుతున్నారు. అయితే తమ జిల్లాకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తమ జిల్లాకు వచ్చిన చంద్రబాబు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని వద్దని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని కర్నూలు వచ్చారని నిలదీస్తున్నారు.


అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రజల గురించి పట్టించుకోలేదని... టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలపై బాదుడే బాదుడు చేసింది చంద్రబాబు కదా అని వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తుంటే దిక్కుమాలిన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అడ్డుతగుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ మండిపడ్డారు.


ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడి అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారని వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ హెచ్చరించారు. ప్రజలు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడిని బాదాడు కాబట్టే ప్రతిపక్షంలో కూర్చొబెట్టారని... అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, ఇలా అన్ని రేట్లు పెంచిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌.. ఇవాళ ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వస్తున్నారో చెప్పాలన్నారు.


చంద్రబాబు గతంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని.. కర్నూలు జిల్లాలో  దాదాపు 85 సంవత్సరాల క్రితం శ్రీబాగ్‌ ఒప్పందం జరిగిందని... దాని గురించి ఈ ప్రాంతానికి అన్యాయం, అవమానం జరిగిందని... ఆ రోజు పెద్ద మనుషులు శ్రీభాగ్‌ ఒప్పందం రాసుకున్నారని.. రాష్ట్రం విడిపోయిన తరువాత మొట్ట మొదట కర్నూలుకు రాజధాని రావాలని వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌ అన్నారు.  హైకోర్టు, రాజధాని, రియల్‌ ఎస్టేట్‌ దందా అన్ని కూడా అమరావతిలోనే పెట్టుకున్న చంద్రబాబు కర్నూలుకు ఏ ముఖం పెట్టుకొని వచ్చాడని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: