మరోక లాజికల్ పాయింట్ ఏమిటంటే ఆనం నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ ఆర్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ప్రభుత్వంపై మీడియా ఎదుటే దుమ్మెత్తిపోశారు. అవమానాలు చేస్తున్న చోట ఇక భరించి ఉండాల్సిన అవసరం లేదన్నది కోటంరెడ్డి ఆవేదన. ఈయన కూడా టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ లో నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు బహిరంగంగానే మాట్లాడారు.
ఇదే సమయంలో వైఎస్ఆర్ పార్టీ వారు తనను సంప్రదించలేదని ఆనం అనుకుంటున్నారు. కానీ ఆ పార్టీ వారు సంప్రదిస్తే ఆగుతారా? లేక ఏం చేస్తారన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైఎస్ ఆర్ పార్టీకి బలమైన పరీక్ష ఎదురుకాబోతోందా.. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో చాలా బలంగానే ఉంది. కానీ ఆనం, కోటంరెడ్డి లాంటి నాయకులు టీడీపీ లో చేరాలని అనుకుంటున్నారు. దీంతో ఏమైనా ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంటుందేమో.
దీంతో అసంతృప్తులను బుజ్జగించేందుకు నెల్లూరు జిల్లాలో ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు వైఎస్ జగన్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పిలిపించుకుని మరి వివరాలు తెలుసుకున్నారు. ఎవరెవరు చంద్రబాబుతో, లోకేష్ తో టచ్ లో ఉన్నారో వారి గురించి వివరాలు అడిగి మరి సీఎం జగన్ తెలుసుకున్నట్లు తెలుస్తోంది.