23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన నందమూరి తారక రత్న నట జీవితంలో అన్ని రకాల పాత్రలు పోషించాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన ముద్ర వేశారు. 20 ఏళ్ల వయస్సులోనే కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన తారకరత్న.. 2001లో ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు నటుడిగా పరిచయమయ్యాడు. తన నట జీవితంలో ఒక వెబ్ సిరీస్ తో పాటు దాదాపు 22 చిత్రాల్లో తారకరత్న నటించాడు.


2006 తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తారకరత్న.. 2009లో అమరావతి చిత్రంతో మళ్లీ సినీ జీవితాన్ని మొదలుపెట్టాడు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన తారకరత్న.. ఆ అమరావతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు అందుకున్నాడు. అలాగే రాజా చెయ్యి వేస్తే చిత్రంలోనూ ప్రతినాయకుడిగా నటించిన తారకరత్న.. సారధి పేరిట తీసిన మరో చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.


తారకరత్న నటించిన చిత్రాలు ఒకసారి పరిశీలిస్తే..  ఒకటో నెంబర్ కుర్రాడు మొదటి సినిమా. ఈ సినిమాతో పాటు తారక రత్న ఒకేసారి 9 సినిమాల్లో హీరోగా చిత్రాలు ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే రికార్డుగా చెబుతారు. అయితే.. ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి వరల్డ్ రికార్డు సృష్టించినా.. ఆ 9 చిత్రాల్లో 5 చిత్రాలు మాత్రమే విడుదల అయ్యాయి. మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు మ్యూజికల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు చిత్రాలు విడుదల అయ్యాయి.


తారక రత్న కేరీర్‌లో చేసిన మిగిలిన సినిమాలు ఇవీ.. యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంత, రాజా చెయ్యి వేస్తే, ఖయ్యూంబాయ్, దేవినేని, ఎస్ 5 నో ఎగ్జిట్, సారథి.. ఇవీ తారక రత్న సినిమాల జాబితా. జనవరి 27న యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన తారకరత్న.. బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో 23 రోజుల పాటు చికిత్స తర్వాత తుదిశ్వాస విడిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: