పవన్ కళ్యాణ్ తాజా ఉపన్యాసం నేపథ్యంలో వైఎస్ఆర్సిపి లో మల్లగుల్లాలు పడుతున్నారు. పవన్ ని తెలుగుదేశానికి దగ్గర కాకుండా చూడ్డానికి చివరిదాకా ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. కానీ ఆయన అయితే ఒంటరిగా పోటీ చేయనంటున్నారు. దీంతో 2014 పరిస్థితి మళ్లీ తిరిగి వస్తుందన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో ఉంది. కానీ వాళ్ళ విశ్లేషణలో, సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే అందరూ 2014 టైపులో కలిసి పోటీ చేస్తే సక్సెస్ అవుతామనుకుంటున్నారు కానీ నిజమేంటంటే అప్పటి ముఖ్య కారణాలు చంద్రబాబుకు అనుభవం ఎక్కువ అనే కారణంతో అప్పట్లో ఏదో పచ్చ మీడియా హైలెట్ చేయడం, జగన్ గెలిస్తే ఫ్యాక్షనిజం వస్తుందని ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నమ్మించడం, రైతు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని నమ్మించడం.


కాపు, గౌడ, రజక రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించడం, కాపుల్లో ఉపముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు నమ్మించడం, మెజారిటీ కాపులు పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అవుతాడని నమ్మడం. ఓటుకు డబ్బులు క్లియర్ గా పంచడం, అనంతపురం హిందూపురంలో బోయ, కొడములకు సీటు ఇస్తానని ఇవ్వకపోవడంతో వెళ్లి టిడిపిలో చేరడం, ఐదేళ్లపాటు పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా ఉండడం.


 ఖచ్చితంగా గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉండడం, తెలంగాణలో ఒకరోజు, ఇక్కడ ఒకరోజు ఎన్నికలు ఉండడం, టిడిపి వాళ్ళు ముందుగానే ఊహించి ఓట్లను అక్కడ ఇక్కడా నమోదు చేసుకోవడం, ధర్మవరం, రాప్తాడు మొదలైన చోట్ల దాదాపు 15వేల దొంగ ఓట్లు ఉండటం, అప్పుడు ప్రోపర్ హోంవర్క్ చేయకపోవడం ఇలాంటివన్నీ  వైఎస్సార్సీపీ ఓటమికి ముఖ్యమైన కారణాలుగా నిలిచాయి.


తెలుగు దేశాన్ని అంటిపెట్టుకున్న బీసీ వర్గాలు ముఖ్యంగా చేనేత, రజక,యాదవ, గౌడ వీళ్ళకి జగనన్న అమ్మ ఒడి, ఇళ్ల స్థలం, ఇంటింటికి పెన్షన్లు, రైతు భరోసా ఇంకా  21 రోజుల్లో ధాన్యానికి నగదు, ఆసరాకు చేదోడు వీటన్నింటినీ  కంటిన్యూ చేస్తాం. అది పవన్ కళ్యాణ్ వల్ల కాదని చెప్తున్నారాయన.

మరింత సమాచారం తెలుసుకోండి: