ఈ మధ్య ఏపీలో ఆర్టీసీలో కారుణ్య నియామాకాలు ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. మొన్ననే ఇస్తామని చెప్పారు. అయితే ఇందులో వివాదం మొదలైంది. 2016 తర్వాత వాళ్లకు ఇస్తున్నారు. 2016 కు మంద ఉన్న వాళ్లకు ఇవ్వట్లేదని తెలుస్తోంది. 2016 కు ముందు చంద్రబాబు ఇవ్వాలి. కానీ ఆయన ఇవ్వలేనట్లు తెలుస్తోంది.  అప్పుడు ఎందుకు ఇవ్వలేరని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు ఇవ్వలేదో అడగాలని ప్రజలు అనుకునేలా చేస్తున్నారు.  


2016 కు ముందు ఉన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాను కారుణ్య నియామాకాలను అందజేయాలి. కొంతమందికి ఇచ్చి మరికొందరికి ఇవ్వక పోవడం అనేది సరైంది కాదనే భావన ప్రజల్లోకి వచ్చింది. కారుణ్య నియామకం వల్ల ఆ కుటుంబానికి లాభం చేకూరుతుంది. ఉపాధి దొరుకుతుంది. ఇలాంటి విషయంలో రాజకీయాలు చేయడం వల్ల వైసీపీ , టీడీపీలు చివరకు ప్రజా వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుంది.


వైసీపీ ప్రస్తుతం  ఏపీలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇస్తామని ప్రకటించిన విషయం తర్వాత అది కొన్ని మలుపులు తిరుగుతోంది. కేవలం 2016 తర్వాత వారికే ఇస్తామని లిటిగేషన్ పెట్టడంతో ఆయా కార్మిక కుటుంబాలు దిక్కు తోచని పరిస్థితిలో పడ్డాయి. 2016 కంటే ముందు టీడీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. దీని వల్ల టీడీపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని వైఎస్ జగన్ చేస్తున్న ప్లాన్ లో భాగమని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు.


ఎన్ని రకాలుగా టీడీపీని ఇబ్బంది పెట్టాలని ప్రజల్లో దోషిగా చూపాలని చూసిన వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ కారుణ్య నియామకాలు అనేవి ఎంతమందికి రావాలి, ఎప్పటి నుంచి రావాలనే వివరాలను పక్కాగా సేకరించి ఎవరికి అన్యాయం జరగకుండా ఇస్తే వైసీపీకే మంచి పేరు వస్తుంది. తద్వారా ఆ పార్టీ నాయకులకు ప్రజల్లో క్రేజ్ పెరిగి గెలిచే అవకాశాలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: