గీతం యూనివర్సీటీలో అక్రమ ఆక్రమణ భూముల వ్యవహారం వెలుగులోకి వస్తున్నాయి. యూనివర్సిటీ బయట ఉన్న స్థలాల్లో ఎక్కువగా ప్రభుత్వ స్థలాలే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎకరాలకు ఎకరాలు లాగేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసినా ఆయన మరణం తర్వాత పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.


ప్రభుత్వ శాఖలకు కేటాయించినా భూముల్లో ఒక్క ప్రభుత్వ శాఖ కూడాా అక్కడ తమ భవంతులు కట్టలేకపోయాయి. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సైలెంట్ అయ్యారు.  చంద్రబాబు హయాంలో వాటిని గీతానికి కట్టబెట్టాలని ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే కోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో అది కుదరలేదని తెలుస్తోంది.


ఇప్పుడు మళ్లీ భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం  సీఎం జగన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రతిపక్ష నేత అచ్చెం నాయుడు మాట్లాడుతూ.. . గీతం యూనివర్సిటీ భూములు ప్రభుత్వం కాావాలనే లాగేసుకుంటోందని, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థల భూములను ఎందుకు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  ఇక్కడ విద్య నేర్పిస్తున్నంత మాత్రాన ప్రభుత్వ భూములు కబ్జా చేసేస్తే ఒప్పుకుంటారా.. లేకపోతే లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఖరీదైన చదువులు చెప్పే సంస్థ వైపు అచ్చెన్నాయుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రభుత్వం తరఫున వారు విమర్శలు చేస్తున్నారు.


రెండేళ్ల క్రితం 36 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.  ప్రస్తుతం 4. 3 ఎకరాల భూమిని మళ్లీ స్వాధీన పరుచుకుంది. ఫెన్సింగ్ తీసేసి ఆ సంస్థ మళ్లీ ఆక్రమించుకుందని ఈ ప్రాంతంలో రెవెన్యూ శాఖ మళ్లీ ఫెన్సింగ్ వేసింది. దీని గురించి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీడీపీ నాయకులు మాట్లాడటంపై వైసీపీ పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటే టీడీపీ వాళ్లకు ఎందుకంత ఆక్రోషం వస్తుందని వైసీపీ పార్టీ లీడర్లు  ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: