వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బిటెక్ రవికి వన్ ప్లస్ వన్ గనమెన్ భద్రత ఇచ్చారు. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక విషయం ఏంటంటే వివేకాను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను బిటెక్ రవికి అప్పగించింది వైఎస్ భాస్కర్ రెడ్డి నే అని ప్రధాన అభియోగం. వివేకాకు 2014 లో ఎమ్మెల్సీ ఇవ్వలేరు. ఆ తర్వాత ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేరు. ఎంపీగా వైసీపీ అవినాష్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. అనంతరం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ను వివేకాకు వైసీపీ ఇచ్చింది. కానీ ఆ స్థానిక సంస్థల్లో ఉన్న నేతలందరినీ గెలిపించింది మాత్రం భాస్కర్ రెడ్డి.



దీంతో అక్కడ ఉన్న స్థానిక సంస్థల్లో ఉన్న అందరూ నేతలు బిటెక్ రవికి మద్దతు తెలిపారు. బిటెక్ రవి గెలిచారు. వివేకా ఓడిపోయారు. 80 శాతం వైసీపీ వారే గెలిచిన ఈ ప్రాంతంలో వివేకా ఎదురుదెబ్బ తగిలింది.  దీంతో అప్పట్లో వివేకా విమర్శలు కూడా చేశారు. భాస్కర్ రెడ్డి, బిటెక్ రవి మధ్య ఒప్పందం వల్లనే ఇలా జరిగిందని విమర్శించారు. అయితే వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా అరెస్టు అయ్యారు. వెంటనే బిటెక్ రవికి ఉన్న గన్ మెన్లను వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం  తొలగించింది.


భాస్కర్ రెడ్డి అరెస్టయితే బిటెక్ రవికి గన్ మెన్లను తొలగించడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అప్పట్లో భాస్కర్ రెడ్డి సహకారం తీసుకుని అనంతరం వేరే పార్టీకి మద్దతిచ్చారనే ఆరోపణలతో ఇప్పుడు గన్ మెన్లను తీసేసినట్లు తెలుస్తోంది. గన్ మెన్లను తీసేయడం వల్ల వైసీపీ ఏం సాధించాలనుకుంటోంది. ఇప్పటికే భాస్కర్ రెడ్డి వర్గం బిటెక్ రవి పై కోపంతో ఉంది. కచ్చితంగా బిటెక్ రవికి గన్ మెన్ల అవసరం ఎంతైనా అవసరం. మరి ఇలాంటి సమయంలో వారి తొలగింపు సరైంది కాదన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: