కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో దేశంలో పరిస్ధితులు విచిత్రంగా మారిపోతున్నాయి. ప్రజా ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్న కారణంగానే కోర్టులు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు మన రాజ్యాంగం కల్పించిన భద్రతను కాపాడటంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విఫలమైనట్లే ఉంది. అందుకనే సుప్రింకోర్టుతో పాటు వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఒక్కసారిగా కీలకమైన కరోనా వైరస్ నియంత్రణ పగ్గాలను తన చేతుల్లోకి తీసేసుకున్నట్లే కనబడుతోంది.  కేంద్రాన్ని సుప్రింకోర్టు రోజువారి వాయించేస్తున్నట్లే వివిధ హైకోర్టులు కూడా ఆయా రాష్ట్రప్రభుత్వాలకు రోజువారీ తలంటు పోస్తున్నాయి. నెలన్నర క్రితం దేశాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను నియంత్రించటంలో నరేంద్రమోడి సర్కార్ అత్యంత దారుణంగా ఫెయిలయ్యిందన్నది వాస్తవం. ఇప్పుడు కూడా చూస్తు కూర్చోలేమని చెప్పిన సుప్రింకోర్టు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది.




కరోనా వైరస్ సెకెండ్ వేవ్ లో పెరిగిపోతున్న ఆక్సిజన్ కొరత, నివారణ+టీకాల కొరత, పరిష్కారం, లాక్ డౌన్ విధింపు, అవకాశాలు లాంటి అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకుని తనకు సరైన డైరెక్షన్ ఇవ్వటానికి సుప్రింకోర్టు 12 మంది నిపుణులతో ఓ కమిటి వేసింది. ఈ కమిటితో కేంద్రానికి ఎలాంటి సంబంధంలేదు. తనంతట తానుగానే సుప్రింకోర్టు కమిటి వేసేసింది.  సెకెండ్ వేవ్ ఉదృతి, తలెత్తబోయే పరిణామాల విషయంలో ఫిబ్రవరి-మార్చిలోనే శాస్త్రజ్ఞులు, సీసీఎంబి డైరెక్టర్, వైద్య నిపుణులు హెచ్చరించినా నరేంద్రమోడి పట్టించుకోలేదని ఇపుడు బయటపడింది. వాళ్ళ హెచ్చరికలను మోడి ఎందుకు పట్టించుకోలేదంటే ఐదురాష్ట్రాల్లో లాభపడాలని+కుంభమేళాకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే. రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరు, లక్షలమందితో జరిగిన కుంభమేళానే ఇపుడు దేశం కొంపముంచేసింది. కాబట్టి తాజా సంక్షోభానికి మోడినే కారకులు.




ఇదే విషయాన్ని సుప్రింకోర్టు, హైకోర్టులు స్పష్టంగా ఎత్తిచూపాయి. ప్రజా ప్రభుత్వాల చేతిలోనే ఇంకా జనాల ధన, మాన, ప్రాణాలను ఉంచితే లాభంలేదనే కోర్టులు యాక్టివ్ పార్టు తీసుకుంటున్నాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలుండగా కరోనా వైరస్ నియంత్రణ పగ్గాలను కోర్టులు తీసుకున్నాయంటే ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిందే. దేశంలో లాక్ డౌన్ విధించాలన్నా, రాష్ట్రాలకు టీకాలు సరఫరా కావాలన్నా ఇలా..ఏమి జరగాలన్నా మోడి నిర్ణయం తీసుకోవాల్సిందే. ఒకవైపు జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత కారణంగా మోడి అసలు ఎవరికీ అందుబాటులోకే రావటంలేదు. పరిస్ధితిని గమినించిన కోర్టులు లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ లాంటి విషయాల్లో వెంటనే చర్యలు తీసుకోమని ప్రభుత్వాలను ఆదేశించాయి. అందరికీ టీకాలను ఎందుకు వేయించలేకపోతున్నాయో సంజాయిషి అడుగుతోంది. కోర్టుల దెబ్బకే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల కర్ఫ్యూ విధిస్తున్నాయి. మొత్తానికి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభంలో దేశం ఈ మాత్రమన్నా ఉందంటే అది కోర్టుల పుణ్యమనే అనుకోవాలి. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: