తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయా.. ఈ రెండు పార్టీలు కలిసి ప్రయాణించబోతున్నాయా.. రాష్ట్రపతి ఎన్నికల అంశంతో ఈ విషయం వెల్లడైందా.. అంటే అవునంటోంది బీజేపీ. రాష్ట్రపతి ఎన్నికలు కాంగ్రెస్, తెరాస పొత్తుకు తొలి మెట్టు అంటున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కాంగ్రెస్, తెరాస కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని.. బీఆర్ఎస్ ఎక్కడికి పోయిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అంటున్నారు.


టీఆర్‌ఎస్‌ బంద్ అయ్యి బీఆర్ఎస్ రావాలని నాకు ఆతృత ఉందని ఎద్దేవా చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు తెలంగాణకు వస్తే పర్యాటకులా... కేసీఆర్ దేశం మొత్తం తిరిగితే పర్యాటకుడో సమాధానం చెప్పాలన్నారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి కేటాయించి ఉంటే ఇప్పటికే పూర్తి అయ్యేదన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. భూమి కేటాయించలేని వీళ్లు విభజన హామీల గురించి మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు.


ఎడమ కాలి చెప్పుతో సమానమైంది కేటీఆర్ జీవితం అంటూ తీవ్రవిమర్శలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఎస్సీ, ఎస్టీలను మొదటి నుంచి టీఆర్ఎస్ అణిచివేస్తోందని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి మోసం చేశారని..
ఎస్సి, ఎస్టీ కమిషన్ తెలంగాణలో లేకుండా పోయిందని విమర్శించారు. ఆత్మ గౌరవ భవనాలు ఎక్కడికి పోయినయని ప్రశ్నించిన ఎంపీ అర్వింద్.. టీఆర్ఎస్ ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు.


ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాకుండా తెరాస వ్యతిరేకంగా ఓటు వేస్తుందని..ఎంపీ అర్వింద్ అన్నారు.  సీబీఐలు మోదీ, అమిత్ షాను తీసుకెళ్లి విచారణ చేయలేదా అని ప్రశ్నించిన ఎంపీ అర్వింద్.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తప్పితే దేశ వ్యాప్తంగా ప్రతి మారుమూల ప్రాంతాల్లో కరెంటు ఉందని విమర్శించారు. మొత్తానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని బీజేపీ విమర్శిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: