ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ముగిసింది. ఆయన రాష్ట్రపతి అవుతాడని ఆశించినా ఆ కోరిక నెరవేరలేదు. అయితే.. చివరి వీడ్కోలు సభలో వైసీపీ మాత్రం వెంకయ్య నాయుడికి ఘనంగా ప్రశంసించింది. కోట్లాది మంది తెలుగు ప్రజలకు వెంకయ్య నాయుడు గర్వకారణమని వైసీపీ రాజ్యస‌భ సభ్యులు విజయసాయిరెడ్డి మెచ్చుకున్నారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో తెలుగు వ్యక్తి కూర్చోవడం గురించి పార్లమెంటులోని ఉభయసభల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు గర్వంగా చెప్పుకుంటారని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు.


వెంకయ్య నాయుడి సొంత జిల్లా అయిన నెల్లూరుకు చెందిన వ్యక్తి కావడం తన అదృష్టమన్న వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.. అనేక సభల్లో ఆయన చేసిన ఉపన్యాసాలు తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాక దేశ వ్యాప్తంగా ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య ప్రసంగాలతో ఒక విద్యార్ధిగా తాను కూడా ఎంతో ప్రభావితమయ్యానని.. నరేంద్ర మోదీ చెప్పినట్లుగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం వంటి అనేక భాషలలో వెంకయ్యనాయుడి పరిజ్ఞానం అపారమైనదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి వెంకయ్యను కొనియాడారు.


రాజ్యసభను వెంకయ్య సమర్దవంతంగా నడిపించారని.. కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కల్పించారని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి  గుర్తు చేసుకున్నారు. ఉద్రిక్త వాతావరణంలో చర్చలు జరుగుతున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలకు కూడా మాట్లాడే అవకాశం కల్పించడం వెంకయ్య నాయుడి గొప్పతనానికి నిదర్శనమని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి  అన్నారు.


పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు వెంకయ్య నాయుడు ఇచ్చిన ప్రాధాన్యత ఎనలేనిదన్న వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.. సమయానుకూలంగా సమీక్షలు నిర్వహించి విలువైన సూచనలు అందించారన్నారు. స్టాండింగ్ కమిటీల చైర్మన్లు, సభ్యుల్లో వెంకయ్య స్ఫూర్తి నింపారని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి  గుర్తు చేశారు. రాజ్యసభ ప్యానల్‌ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌గా రాజ్యసభ అధ్యక్ష స్థానంలో కూర్చొని సభను నిర్వహించే అవకాశం కల్పించడం తన జీవితంలో మరుపురానిదని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: