పాకిస్తాన్‌ను సమస్యల వలయం చుట్టుముడుతూనే ఉంది. పాక్‌ ఆక్రమిత్ర కాశ్మీర్ అయినటువంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ నుంచి మమ్మల్ని విడగొట్టాలని అక్కడి ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. కార్గిల్ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు అయితే ఏకంగా భారత్ లో కలపాలని మేము ఇక్కడ ఉండలేం అంటూ నిరసనలు చేస్తూనే ఉన్నారు. కారణం పాకిస్తాన్లో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వారు అనుభవిస్తున్న బాధలు వారు పడుతున్న వేదన అంతా కాదు. దీనిపై పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఒక అగ్ర నేత యునైటెడ్ కాశ్మీర్ నేషనల్ పీపుల్స్ పార్టీ స్పోక్స్ పర్సన్ నజీర్ అజీజ్ ఏమన్నారంటే మేం పాకిస్తాన్లో ఉండలేం మాకు స్వేచ్ఛ కావాలి అని. ఇక్కడ ఉంటే మేము మా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుందని బాధపడుతున్నారు.


అలాగే పాకిస్తాన్ సృష్టించిన తీవ్రవాదం జమ్మూ కాశ్మీర్ అండ్ పిఓకేకు మాత్రమే పరిమితం కాలేదు. అది ప్రపంచ దేశాలకు విస్తరించిందని దీని ద్వారా ప్రపంచ దేశాలు చివరికి కెనడా కూడా బాధపడాల్సిన పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా లష్కర్ ఏ తోయిబా మరియు ఇతర ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉగ్రదాడులను చేస్తున్నాయి. ముఖ్యంగా  లష్కరే తోయిబా అనే సంస్థలు ఆయా దేశాల్లో వేరే వేరే పేర్లతో స్వచ్ఛంద సంస్థలుగా మారుకుంటూ అవి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. చివరికి దాడులు చేయడం. ఇంకా ముఖ్యంగా భారత్ కి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలను వారు చేపడుతూ భారత్ ని దోషిగా నిలబెట్టడానికి ఈ సంస్థలు పని చేస్తున్నాయి.


వీటన్నిటికీ మాతృ సంస్థ పాకిస్తాన్. పాకిస్తాన్‌లో వీరంతా శిక్షణ పొంది ప్రపంచ దేశాల్లో పని చేస్తున్నారు. మొత్తం మీద పిఓకే లో ఒక రకమైన పరిస్థితి నెలకొంది. అది ఏంటంటే పాకిస్తాన్ నుంచి కచ్చితంగా వేరే కావాలని పిఓకే ప్రజలు కోరుకుంటున్నారు. గొడవలు పెట్టుకోకూడదని దాని నుంచి వేరేగా ఉండాలని ఆశిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

POK