
కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా చెప్పుకోవడంలో జగన్ ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంది. ఏడాదికి 13500 చొప్పున నాలుగు సంవత్సరాల్లో రైతుల ఖాతాల్లో రూ.50 వేలు జమ చేస్తామని జగన్ ప్రకటించారు. తర్వాత మొదటి సంవత్సరం నుంచే ఇస్తామన్నారు. ఇందులో ఏడాదికి రూ.7500 రాష్ట్రం ఇస్తుందని మిగతావి కేంద్రం మూడు విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6000 ఇస్తున్నాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి బదులు పీఎం కిసాన్ భరోసా అని తను మొత్తం ఇచ్చినట్లుగా జగన్ చెప్పుకుంటున్నారు. అయిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 35 వేల రూపాయాలు మాత్రమే. మిగతా డబ్బులు కేంద్రం ఇస్తుంది. దీనికి పీఎం కిసాన్ అని కూడా యాడ్ చేశారు. హౌసింగ్ కు కూడా పీఎంజేవై అని జగనన్న ఇల్లు అని పెడుతుంటారు. ఆరోగ్య శ్రీకి మాత్రం ఆయుష్మాన్ భారత్ అనే పేరును యాడ్ చేయలేరు.
ఆసుపత్రులకు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సూచించిన పేరు పెట్టాలని కోరుతుంది. పేరు పెట్టకపోతే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. కేంద్రం సూచించిన పేరును ఆసుపత్రులకు పెట్టేందుకు ఒప్పుకుంటాయా.. లేక దీన్ని రాజకీయంగా మార్చి వివాదాన్ని సృష్టించుకుంటాయా త్వరలోనే తేలిపోతుంది.