ఉక్రెయిన్ ఆహార కొరత, ఆయుధ కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ పై  భీకరమైన దాడులకు తెగబడుతోంది. ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు అయిపోయి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నది. అమెరికా, యూరప్ దేశాలు ఆయుధాలు, మిస్సైల్స్ ఇవ్వడం లేదు. దీంతో యుద్దంలో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. ఒక వేళ ఉక్రెయిన్ ఓడిపోతే ప్రపంచం మొత్తం ఓడిపోయినట్లే అని చెబుతున్నా అమెరికా, యూరప్ దేశాలు ఎక్కువగా ఆయుధాలను ఇవ్వడంలో విఫలమవుతున్నాయనే చెప్పొచ్చు.


ప్రస్తుతం ఉక్రెయిన్ లోని బంకర్లను ధ్వంసం చేయడానికి రష్యా సిద్ధమవుతోంది. పోలండ్ నుంచి బంకర్ల ద్వారా ఆయుధాలు వస్తున్నట్లు గమనించిన రష్యా ఉక్రెయిన్ లోని కొన్ని స్థావరాలను ధ్వంసం చేసింది. భారీ బాంబులతో విరుచుకుపడింది. 1.5 టన్నుల బాంబును 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించగల సామర్థ్యం ఉన్న దాన్ని రష్యా ప్రయోగించింది.


ఇది బంకర్ల పై ప్రయోగించింది. యుద్ధ విమానాలను కూడా ఉక్రెయిన్ రహస్యంగా తీసుకువస్తోంది. బంకర్ల ద్వారా అండర్ గ్రౌండ్ లో వాటిని దాచి పెడుతుంది. పెద్ద పెద్ద సొరంగాల ద్వారా ఆయుధాలను, యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ దాచిపెడుతోంది. దీన్ని గమనించిన పుతిన్ వాటిన్నింటిని ప్రస్తుతం ధ్వంసం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.


దీంతో ఉక్రెయిన్ ఏం చేయాలో తోచక దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఇప్పటివరకైతే రష్యా యుద్ధంలో ముందడుగు వేస్తూనే ఉంది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తుంది. అయితే ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఉక్రెయిన్ ప్రజలకు కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికా, యూరప్ దేశాలు చేసే సాయంతోనే ఇన్ని రోజులు యుద్ధాన్ని కొనసాగిస్తున్నఉక్రెయిన్ మళ్లీ అమెరికా, నాటో దేశాలను అభ్యర్థిస్తోంది. ఆయుధాలు మరిన్ని వేగంగా అందిస్తే రష్యా సైన్యంతో పోరాటం చేసేందుకు మా సైనికులు సిద్ధంగానే ఉన్నట్లు చెబుతోంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: