
అయితే శ్రీలంక తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడారు. శ్రీలంక సంక్షోభంలో కూరుకుపోయినపుడు ప్రపంచం మమ్మల్ని వదిలేసింది. ఎలాంటి సాయం చేయలేదు. ఆదుకోలేరు. వైద్య పరికరాలను వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ భారత్ మాత్రం మమ్మల్ని ఆదుకుంది. అత్యవసరమైన సాయాలు చేసింది. రాజకీయ, ఆర్థిక సంక్షోభం లంకలో ఎదురైనపుడు భారత్ మాకు మూడున్నర బిలియన్ డాలర్ల క్రైట్ లైన్ తో పాటు, ఒక బిలియన్ డాలర్ల సాయం చేసింది.
ఆహారం, మందులు, అత్యవసర వాహనాలు పంపారు. ఐఎంఎప్ లోన్ కు షూరిటీగా నిలబడింది. శ్రీలంక మళ్లీ డెవలఫ్ మెంట్ కావడానికి అన్ని విధాలుగా సాయం చేసేందుకు భారత్ ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రపంచం మమ్మల్ని పట్టించుకోని సమయంలో భారత్ మాకు చేసిన సాయం ఎప్పటికీ మరువలేమని అన్నారు. భారత్ లో జీ 20 దేశాలకు సంబంధించి జరుగతున్న సదస్సులో శ్రీలంక విదేశాంగ మంత్రి భారత్ గొప్పతనం గురించి తెలియజేశారు.
టర్కీలో భూకంపం వచ్చినపుడు కూడా భారత్ తన వంతు సాయం చేసింది. దేశం నుంచి భద్రత సిబ్బందిని పంపింది. అక్కడ భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టే విషయంలో ముందు నిలిచింది. దీంతో అక్కడి ప్రధానమంత్రి కూడా భారత్ కు మేమెంతో చెడు చేయాలని చూశాం. కానీ భారత్ మమ్మల్ని కష్ట సమయాల్లో ఆదుకుందని మీడియాలో చెప్పారు. భారత్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ కష్టమొచ్చినా భారత్ తన వంతు పాత్ర పోషిస్తూ అందరినీ ఆదుకుంటోంది.