
అలా సాగుతున్న ఒక పద్ధతి వైయస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీగిపోయిందని తెలుస్తుంది. చిరంజీవిలాంటి చరిష్మా ఉన్న నాయకుడికే 18 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డికి గత ఎలక్షన్ల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. దీనికి అసలైన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ ని తొక్కేస్తున్నారు అన్నట్లుగా వచ్చిన వార్తలు. ఈ వార్తలు ప్రజల్లోకి బాగా వెళ్లిపోవడం వల్ల, పిల్లవాడిని తొక్కేస్తున్నారు అన్నట్లుగా ఒక సింపాతీ అనేది క్రియేట్ అయ్యింది.
దాంతో ప్రతిపక్ష నాయకుడిగా గతంలో ఉన్న జగన్ ఇప్పుడు అధికారపక్ష నాయకుడిగా ఎదిగేందుకు ఉపయోగపడింది. జగన్ మీద వచ్చిన ఈ సింపతి వల్ల చంద్రబాబు నాయుడు మొన్నటి ఎలక్షన్లలో ఓడిపోయారు. అది గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పని అన్నారు. అయితే ఇప్పుడు అదే తప్పును వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారని అంటున్నారు. గతంలో తన కొడుకు ఎదగడేమో అనుకుని వైయస్ జగన్మోహన్ రెడ్డిని తొక్కేయడానికి ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు అని, ఇది వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్ అని తెలుస్తుంది.
అయితే దీనిలో భాగంగా జగన్ తన సంస్థలో పెట్టిన పెట్టుబడులను చూపించి, ఆ ఫైల్స్ చూపించి తన ద్వారా కాకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా జగన్ పై కేసులు పెట్టించింది చంద్రబాబు నాయుడు అని జగన్ కి ఒక నమ్మకం. వీటన్నీటిని దృష్టిలో పెట్టుకుని జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు కొంతమంది ఇప్పుడు.