
గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అక్కడి వరకు వెళ్లి ఉపన్యాసం చేయడం ప్రశంసనీయమే కానీ ఇంత వరకు ఎప్పుడు వెళ్లనట్లు ఇప్పుడు కొత్తగా వెళ్లినట్లు రోత వార్తలు రాస్తున్నదని తీవ్ర పదజాలంతో రాసుకొచ్చారు. అయితే ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదివిన విద్యార్థులు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై అవకాశం రావడం నిరుపేద విద్యార్థులు అక్కడ ఉపన్యాసించడం అంటే మామూలు విషయం కాదు.
పది మంది విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలో పాల్గొనగానే ఇలా గొప్పలు చెప్పడం సరికాదని అంటున్నారు. న్యూయార్క్ లో నాసా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో రష్యా లాంగ్వేజ్ లో మాట్లాడారు. వీరంతా సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో వెళ్లి ఉన్నతమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఎంతో మంది విద్యార్థులు ఇలా వెళ్లి ప్రసంగించిన సందర్భాలు ఉన్నాయి.
అయితే వీటి గురించి ఏనాడు కూడా విద్యార్థులు గురించి ఇంతలా చెప్పడం ప్రభుత్వం గురించి డబ్బా కొట్టుకోలేదని రాస్తున్నారు. అయితే గత అయిదేళ్లలో చంద్రబాబు ఎంతమంది విద్యార్థులను ఇలా విదేశాలకు పంపించారు. సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల మీద విషయం చిమ్ముతూ వార్తలు రాయడం తద్వారా వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే వార్తలు రాయడం తప్ప వారిని ప్రోత్సహించి మరింత ముందుకెళ్లే కథనాలు రాయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.