తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం పదవి చేపట్టారు. కేసీఆర్ అపర చాణిక్యుడు, అపర మేధావి అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఈయన ఎలాంటి ప్లాన్ లు వేస్తారో ఊహించడం కూడా కష్టం. అలాంటి కేసీఆర్ కూడా మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుండటంతో పలు రకాల వ్యూహాలు పన్నుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ , తెలుగుదేశం ప్రభావం లేకపోతే 70-80 స్థానాలు వస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవేళ ప్రభావం పడినా 60-70వరకు సీట్లు వస్తాయని పేర్కొంటుంది.  గత 2018 ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఆశించిన మేర సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటులో ఈ జిల్లాలు కూడా కీలక  పాత్ర పోషించాయి.


ఈసారి అక్కడ ఉన్న తెలుగుదేశం సానుభూతి పరులను రేవంత్ రెడ్డి బాగానే ట్రాప్ చేయగలిగారు. గతంలో టీడీపీ తరఫున పనిచేసిన సోషల్ మీడియా విభాగం ఆయనకు బాగానే లబ్ధి చేకూర్చింది. ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. అదే సమయంలో ఫలానా పార్టీకి ఓటేయమని ఇటు చంద్రబాబు.. అటు నారా లోకేశ్ చెప్పలేదు. కానీ వాళ్ల క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది అనేది బహిరంగ రహస్యం.


ఇప్పుడు టీడీపీ ఏమీ ప్రకటించకపోయినా ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ వైపు తరలి వెళ్తుంది.  ఈ ప్రభావం బీఆర్ఎస్ పై భారీ గానే పడుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కమ్మ సామాజిక  ప్రతినిధులతో.. ఇతర సామాజిక వర్గ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు చంద్రబాబు అరెస్టు కి తెలంగాణకు ఏం సంబంధం అన్న నాయకులు కూడా ఆయనపై సానుభూతి చూపించి.. హైదరాబాద్ అభివృద్ధి ప్రదాత చంద్రబాబే అని కూడా చెప్పవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: