
బహిరంగంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి టీడీపీ కృషి చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బహిరంగంగా ఇద్దరి మధ్య పొత్తు, అవగాహన వంటికి కుదరకపోయినా.. అంతర్గతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా బీజేపీ ఓడిపోవాలని టీడీపీ భావిస్తోంది. తెలంగాణలో మాత్రం కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలంగాణ టీడీపీ నేతలతో పాటు ఏపీ నాయకులు సైతం భావిస్తున్నారు.
వారి అంచనాలు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని టీడీపీ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 130-140 సీట్లు వస్తాయని బీజేపీకి 70 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేస్తోంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ కు 120-130 సీట్లు, బీజేపీకి 45-50 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ఛత్తీస్ గఢ్ లో హస్తం పార్టీకి 70-80 సీట్లు వస్తే కాషాయ పార్టీ 9 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలిపింది. ఇక తెలంగాణలో అధికారం కోసం కలలు కంటున్న కాంగ్రెస్ కు 65 - 70స్థానాలు వస్తాయని, బీజేపీకి 3-6, బీఆర్ఎస్ కు 35-40 సీట్లకే పరిమితం అవుతుందని వివరించింది. అయితే కాంగ్రెస్ వాళ్ల లెక్కలు చూసుకుంటే మాత్రం 71-76స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న అహంకార పూరిత ధోరణి నచ్చకే ప్రజలు తమవైపు చూస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది.