
తెలుగు తమ్ముళ్లు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న కీలక ఘట్టానికి మహానాడు వేదిక కానుంది. పార్టీ యువ నాయకుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి , మంత్రి నారా లోకేష్ కు పార్టీలో కీలక పదవి ఇచ్చేందుకు దాదాపు ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇది అధ్యక్షుడు తర్వాత అధ్యక్షుడు స్థానం పదవికి నారా లోకేష్ ను అంతర్గతంగా ఎంపిక చేశారు. దీనిని అధికారికంగా ప్రకటించడం మాత్రమే తరువాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు పోలీట్ బ్యూరో లో 60 శాతం మంది అనుకూలంగా అంగీకరించాలి ... కొన్నాళ్లు కిందట జరిగిన పోలీస్ బ్యూరో సమావేశంలోనే నారా లోకేష్ అనుకూలంగా వంద శాతం నాయకులు అంగీకారం తెలిపారు. ఒకరిద్దరి సీనియర్లు ఇప్పుడే వద్దని చెప్పడంతో చంద్రబాబు సూచనలను వారు సైతం అంగీకరించారు.
దీంతో ఈ మహానాడు వేదికగా నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేలా తీర్మానం చేస్తారని సమాచారం. మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే మహానాడులో రెండో రోజు నారా లోకేష్ కు ఈ పదవిని కేటాయిస్తూ పార్టీ అధ్యక్షుడు హోదాలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పదవి ఇవ్వటం ద్వారా పార్టీలో నేరుగా నారా లోకేష్ కు తదుపరి అధ్యక్ష పీఠం అందుకునే అవకాశం ఉంటుంది. గత మహానాడులోనే ఈ ప్రతిపాదన వచ్చింది. కొందరు సీనియర్లు అడ్డుపడటం ... ఎన్నికల ముందు ఈ నిర్ణయం సరికాదని భావించడంతో వాయిదా వేశారు. ఈసారి సీనియర్ల నుంచి సహకారం రావడం,, యువగళం పాదయాత్రలతో లోకేష్ తనను తాను ప్రూవ్ చేసుకోవడంతో ఈసారి లోకేష్ కు ఈ విషయంలో తిరుగులేకుండా పోయిందని చెప్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు