
అయితే ఇతర మంత్రుల విషయానికి వచ్చేసరికి నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నారాయణ ఈ ముగ్గురికి కొంత మేరకు పరవాలేదు అన్న టాక్ వినిపించింది. పదిమంది మంత్రుల విషయంలో మాత్రం ప్రజలు చాలా నిరాశ నిస్పృహలతోనే ఉన్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎక్కువగా ప్రజలు ఈ పదిమంది మంత్రులపై ఆవేదనతోను ఆగ్రహంతోనే ఉన్నారు. వీటిలో కీలకమైన శాఖ విద్యుత్ శాఖ. ఈ శాఖ మంత్రిగా ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ వ్యవహరిస్తున్నారు.
వ్యక్తిగా ఆయన మంచి నాయకుడే. పాలనపరంగా ఆయన మంచి అనుభవం ఉన్న వ్యక్తి. కానీ పెరుగుతున్న ధరలు, పోటు ఎత్తుతున్న విద్యుత్ బిల్లుల కారణంగా మంత్రి పని తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇది ఆయన చేసిందా గత ప్రభుత్వం చేసిందా అనేది ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది ప్రభుత్వం మారింది మా బాధలు తగ్గాలి.. మా బిల్లులో బరువు తగ్గాలని కోరుకుంటారు. కానీ ఈ విషయంలో గొట్టిపాటి రవికుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.
ప్రస్తుతం అయితే గొట్టిపాటి రవికుమార్ పై ఎక్కువగా ఆగ్రహంతో ప్రజలు ఉన్నారనేది సర్వేలు చెప్తున్న మాట. ఇక వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్య కుమార్ యాదవ్ పై ప్రజలు మరింత ఎక్కువగా ఆగ్రహంతో ఉన్నారు. వైసిపి హయాంలో అమలైన ఆరోగ్యశ్రీ ప్రస్తుతం చాలా జిల్లాలలో ఆగిపోయింది. అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలలు ప్రజలకు దూరమయ్యాయి. కనీస సదుపాయాలు లేని వైద్యశాలలపై అనుకూల మీడియాలోనే అనేక కథనాలు వస్తున్నాయి. ఇక వైద్యులు నిర్లక్ష్యంతో ఉండడం సిబ్బంది అందుబాటులో లేకపోవడం రోగులపట్ల హీనంగా చూడడం వంటివి మంత్రి పని తీరుపై తీవ్ర విమర్శలు చేసేలా చేస్తుంది.
ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్య కుమార్ రాష్ట్రాన్ని మొత్తానికి మంత్రి కానీ ఆయన మొదట్లో బాగానే చేసిన ఆ తర్వాత కొన్ని కారణాలతో పనితీరును మందగించేలా చేశారు. దీంతో ఆసుపత్రులు మళ్లీ తిరోగమనం పట్టాయి. ఈ పరిస్థితిని ఇటీవల ప్రజలు ప్రశ్నించారు. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పై మహిళలు అంతర్గతంగా చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. మహిళలకు భద్రత లేకపోవడం జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు అత్యాచారాలపై మహిళలు మంత్రి అనితను టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె సమీక్షించుకోవాలి. సరిచేసుకోవాలి.
బీసీ శాఖ మంత్రి సవిత పర్యటనలు చేస్తున్నారు. ప్రజల మధ్య ఉంటుందని చెబుతున్నారు. శాఖలపై సమీక్ష చేస్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఆమెకు మైనస్ మార్కులు పడుతున్నాయి. దీనికి కారణం సవిత ఇస్తున్న ఆదేశాలను ఎవరూ పట్టించుకోకపోవడం ఆమె చెబుతున్న పనులు ఏవి క్షేత్రస్థాయిలో జరగకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇక మరో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
కానీ క్షేత్రస్థాయిలో ఎస్సీలకు జరుగుతున్న దాడులను ఎస్సీ సంక్షేమ పథకాలను అందించలేకపోతు న్నారనే మాట వినిపిస్తోంది. దీంతో ఆయన కూడా మైనస్ మార్కులు లోనే ఉన్నారు .25 మందిలో పదిమంది డేంజర్ జోన్ లో ఉంటే ఆరుగురు మాత్రమే ఫస్ట్ క్లాస్ లో ఉన్నారు. మిగిలిన వాళ్లంతా అటు ఇటుగా ఉన్నారు. కాబట్టి మంత్రులు తమ పనితీరును సమీక్షించుకుని సరి చేసుకుంటే మంచిదనే ఉద్దేశం సర్వేల ద్వారా స్పష్టమవుతోంది. మరి ఏం చేస్తారనేది చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు