
చంద్రబాబు క్యాబినెట్లో మంత్రివర్గంలో మొత్తం ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. హోం మంత్రి అనిత - బిసి సంక్షేమ మంత్రి సవిత - గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. ఈ ముగ్గురు మహిళా మంత్రుల విషయంపై సీఎం చంద్రబాబు ఒకంత సంతృప్తి వ్యక్తం చేస్తున్న అంతర్గతంగా వీరు ఇంకా బాగా పనిచేయాలని చెబుతున్నట్టు తెలుస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు చేస్తున్న సూచనలు ఆయనలో ఎంతో కొంత అసంతృప్తిని బయటపెడుతున్నాయి. హోం మంత్రి అనిత విషయంలో బాబు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. విపక్షాల సహా నాయకులు రాష్ట్రంలో శాంతిని భద్రతలు లేవని విమర్శలు గుప్పిస్తున్న ఓవరాల్ గా అనితకు చంద్రబాబు మంచి మార్కులు వేస్తున్నారట.
ఎలాంటి కాంట్రవర్సీ నిర్ణయాలు తీసుకోకపోవడం.. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినా ఆచితూచి అడుగులు వేయటం అనితకు కలిసి వస్తున్నాయి. అలాగే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసే విషయంలో అనిత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ఇక సవిత విషయానికి వస్తే ఇంట్లో ఈగల మోత ... బయట పల్లకీల మోత అన్నట్టుగా ఆవిడ పరిస్థితి ఉంది. ఆమె సొంత నియోజకవర్గంలో ఆధిపత్య రాజకీయాలకు ఆమె అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కాకపోతే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మంచి మార్కులు పడుతున్నాయి. ఇక చంద్రబాబు కూడా కష్టపడుతున్న మంత్రిగా సవితకు మంచి మార్కులు వేస్తున్నారు. మహానాడు సమయంలో సైకిల్ యాత్ర చేపట్టటం అందరికీ భిన్నంగా వ్యవహరించడం తో ఆమె చంద్రబాబు దృష్టిలో పడ్డారు.
అయితే నియోజకవర్గంలో అంతర్గత రాజకీయాలు పరిష్కరించుకోవాలని కూడా ఆమెకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఇక గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణికి కూడా మంచి మార్కులు పడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి .తరచుగా ప్రతిపక్షం పై టార్గెట్ చేయకపోయినా స్థానికంగా ఆమె వ్యవహరిస్తున్న తీరు సమస్యలపై స్పందిస్తున్న విధానం ఇవన్నీ ఆమెకు ప్లస్ అవుతున్నాయి. ఏది ఏమైనా ముగ్గురు మహిళా మంత్రుల విషయంలో చంద్రబాబు చాలా వరకు సంతృప్తితోనే ఉన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు