ఇందులో కీలకంగా కనిపిస్తున్న అంశం బీజేపీ వ్యూహం. బీజేపీకి బలహీన స్థితిలో ఉన్న రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన ప్రాంతీయ పార్టీలను ముందుకు తేవడం అనే రాజకీయ గణితం చాలాకాలంగా కొనసాగుతోంది. గడచిన దశాబ్దాల్లో అసోం గణ పరిషత్ వంటి ఉదాహరణలు ఈ దిశగా నిలిచాయి. ఇప్పుడు అదే మార్గంలో జనసేనను బీజేపీ ఉపయోగించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల నుంచే జనసేన తన పాదం మోపే అవకాశం ఉందని సమాచారం. ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టడం, అక్కడ కొత్త సమీకరణాలు వెలువడడం వంటి అంశాలు జనసేన విస్తరణకు బీజం వేయగలవని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఉద్దేశం కేవలం ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు రాష్ట్రాల్లోనే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపాలన్న తపన ఉన్నట్టు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి పొరుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టడం సహజంగానే తదుపరి లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అవతరించడం కష్టమైన పని అయినా, ఆ దిశగా పవన్ ప్రయత్నాలు సఫలమైతే, తెలుగు నేలపై ఆవిర్భవించిన జనసేన పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణమవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి