
ఈ సంఘటనపై ఆగ్రహం చెందిన సురేఖ గురువారం మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకుండా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. సురేఖ ఇష్యూ పార్టీ అంతర్గత వివాదాలను మరింత ఊపందుకునేలా చేస్తోందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.సురేఖ కుమార్తె సుస్మిత పాటేల్ సంచలన ఆరోపణలు చేయడంతో విషయం మరింత ఉద్ధృతమైంది. డక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని సుమంత్ బెదిరించినట్లు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంకు తెలిపడంతో చర్యలు వేగవంతమయ్యాయి.
సుస్మిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తల్లిని అనేకసార్లు అవమానించారని, బీసీలపై కుట్రలు రచుతున్నారని ఆరోపించింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వంటి వారిని కూడా లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. మేడారం జాతర పనులలో పొంగులేటి కంపెనీకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు కూడా వివాదానికి కారణమని సురేఖ కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాలు పార్టీలో కుల రాజకీయాలను మరింత ఊపందుకునేలా చేస్తున్నాయి.ఈ ఘటనల తర్వాత సురేఖ తన కుమార్తెతో కలిసి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు ఫోన్ చేసి సమావేశం కావాలని కోరారు.
మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా మీనాక్షి వారించడంతో ఆమె ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లతో కలిశారు. సురేఖ తనపై జరుగుతున్న కుట్రలు, కుటుంబానికి ఎదురవుతున్న ఇబ్బందులు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ నేతలతో వైరం వంటి అంశాలను వివరించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు