తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో ఎంసెట్, నీట్, జేఈఈ మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్, నీట్‌, ఐఐటీ జేఈఈ పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కోచింగ్ అందిస్తోందన్నారు.అది ఎలాగంటే..ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందట.. ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం వారు సూచించడం జరిగింది.మంచి నైపుణ్యం గల లెక్చరర్లతో ఈ కోచింగ్ నిర్వహిస్తున్నామని తెలిపడం జరిగింది. ఇక ఈ కోచింగ్ అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ కోచింగ్‌ను http://tscie.rankr.io/ లింక్ ద్వారా పొందవచ్చునని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలపడం జరిగింది.

ఇక ఇదిలా ఉండగా టీఎస్ ఎంసెట్ ఎంట్రెన్‌ ఎగ్జామ్ 2021 హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. స్టూడెంట్లు ఎంసెట్‌ అధికారిక వెబ్‌సైట్ అయిన https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించడం జరిగింది. ఇక అర్హులైన అభ్యర్థులు ఈనెల 31వ తేదీ దాకా తమ తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపడం జరిగింది.కాగా.. ఇక ఎంసెట్ ఎగ్జామ్స్ ని ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారట. ఇంజనీరింగ్ విభాగానికి ఆగస్టు 4, 5, 6 తేదీల్లో నిర్వహించనుండగా..అలాగే అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ కోసం ఆగస్టు 9, 10 తేదీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారట.ఇక ఇదిలాఉంటే.. ఇప్పటి దాకా కూడా ఎంసెట్‌కు 2.49 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించడం జరిగింది. ఇక వీటిలో ఇంజనీరింగ్‌కు 1.63 లక్షల దరఖాస్తులు అలాగే ఫార్మా ఇంకా అగ్రికల్చర్ విభాగాలకు 85,828 అప్లికేషన్లు వచ్చాయన్నారు. అయితే ఇక ఎంసెట్‌ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉందట. ఇక  500/- రూపాయల ఆలస్యం రుసుముతో జులై 29వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునట. ఇప్పటి దాకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: