ఇది డిఫెన్స్ రోడ్
ముడు గంటల ప్రయాణం కేవలం పదిహేను నిమిషాలకు తగ్గితే ఎలా ఉంటుంది ?.. ఏ మాత్రం అనువుగా లేని వాతావరణం, ఇంకా చెప్పాలంటే అత్యంత క్లిష్టమైన  పరిసరాలు... అది కూడా సముద్ర మట్టానికి పదకొండు వేల ఐదు వందల అడుగుల ఎత్తున సాగే ప్రయాణం... దూరం తగ్గితే ...సాఫీగా సాగితే అంతకన్నా కావలసింది ఏముంటుంది ? సరిగ్గా ఇదే జరగనుంది.
 భారత రక్షణ వ్యవస్థకు కొత్త జవసత్వాలు అందిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం హిమాలయ పర్వత  ప్రాంతాలలో నూతన రహదారుల నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. ఇందు కోసం వెలకోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. మిలటరీ వాహనాలు,  పర్యాటకులు  హిమాలయ పర్వత ప్రాంతాలలో ప్రయాణించాలంటి  రహదారులు అంతంత మాత్రమే.  అత్యవసర పరిస్థితుల్లో, మరీ ముఖ్యంగా పొరుగు దేశాల సైన్యం దాడి చేసినప్పుడు  రవాణ కు పడే తంటాలు అంతా ఇంతా కాదు.
దీనిని గుర్తించిన  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్గరీలు  నూతన రహదారుల నిర్మాణానికి పచ్చజెండా ఊపారు.  శ్రీనర్- లడ్డాక్ ను కలిపే రహదారిని  వేలకోట్ల రూపాయలతో  నిర్మించాలని తలపెట్టారు.  ఆలోచనలకు వెంటనే కార్యరూపం దాల్చేలా కృషి చేశారు. ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ  రహదారుల ప్రాజెక్టు ఆరంభమైంది.  హైదరాబాద్ కు చెందిన మేఘూ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మాణ పనులను దక్కించుకుంది.  సాధారణ రోడ్లకు భిన్నంగా ఈ రహదారిని నిర్మించాలని మేఘూ సంకల్పించింది.  ఇప్పటి వరకూ నిర్మించిన రహదారులు  తారుతోను, సిమెంటు తోను నిర్మించే వారు.  అయితే నిర్మాణ పనులను చేపట్టిన మేఘూ సంస్థ   నూతన సాంకేతికతతో ఈ రహదారి నిర్మిస్తోంది. ఇందు కోసం పాలిస్టైరిన్ ను వాడుతోంది. దీని వలన రహదారులు మంచుతో కప్పబడినప్పటికీ  చెక్కు చెదరవు. ఈ  ప్రాంతంలో రహదారులు ఏడాదిలో దాదాపు నాలుగైదు నెలల పాటు మంచుతో కప్పబడి  ఉంటాయి. ఫలితంగా వాటి జీవన కాలం తక్కవగా ఉంటుంది.  పోలిస్టైరిన్  వాడటం వల్ల  రహదారులపై మంచు ఏర్పడినా  ఎక్కువ కాలం మన్నుతాయి. ఐరోపా దేశాలలో రహదారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తారు. అక్క డ వాడే సాంకేతిక పరిజ్ఞానాన్ని శ్రీనర్- లడ్డాక్ ను కలిపే రహదారిలో నూ వాడుతున్నారు. ఆదునిక భద్రతా వ్యవస్థ ఇక్కడ ఉంటుంది.  ఎమర్జన్సీ టెలిపోన్, ఎమర్జెన్సీ రేడియో, |ఆటోమేటిక్ లైటింగ్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ లాంటి సదుపాయాలెన్నో ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ రహదారిలో మరో ప్రత్యేకత ఉంది. మార్గంలో రెండ టన్నెళ్లను కూడా నిర్మస్తున్నారు. ఇరు వైపులా వాహనాల రాకపోకలకు అనువుగా  7.5 మీటర్ల ఎత్తు, 9.5 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ  టన్నెళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. 2026  నాటికి రహదారులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అనుకున్నది అనుకుట్టుగా జరిగి , నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తే,  ఈ  రహదారి , టన్నెళ్లు అసియా చరిత్ర లో ఓ మైలు రాయిగా నిలుస్తాయి.   మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా ( ఎం.ఐ.ఈఎల్)  నిర్మంచిన ఈ రహదారిని  కేంద్ర రహదారులు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్గరీ మంగళవారం పరిశీలించి ప్రారంభించారు. అయితే 2023 డిసెంబర్  తరువాతనే ఈ రహదారిపై అధికారికంగా రాకపోకలు సాగుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: