భారతీయ మార్కెట్ లో బంగారం ధరలు నిలకడగా లేవని చెప్పాలి.. రోజుకో విధంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి, అదే విధంగా తగ్గుతున్నాయి..ఇక పోతే నిన్న దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం రేట్లు ఊరట కలిగిస్తున్నాయి. ఇవాళ పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గింది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.48,250 ఉండగా.. రూ. 100 తగ్గి రూ.48,150కి పడిపోయింది.. 




ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో నిన్న బంగారం, వెండి ధరలు విషయానికొస్తే..24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,250 నుంచి రూ. 49,150కి పడిపోయింది..22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.48,250 ఉంది. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960గా ఉంది.నిన్నటితో పోలిస్తే ఈరోజు రేట్లు షాక్ ఉపశమనాన్ని కలిగిస్తాయి. బంగారం ధరల పై వెండి ధరలు ఆధారపడి పయనిస్తున్నాయి. 



ఈరోజు వెండి ధరలను చూస్తే.. వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. దేశంలో కిలో వెండి ధర నిన్న రూ.63,600 ఉండగా.. రూ. 400 తగ్గి రూ.63,200కు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లోనూ కిలో వెండి ధర రూ.63,200గా ఉంది. వెండి ధర ఈరోజు తగ్గడానికి కారణం వెండి , నాణేలు, వస్తువుల పై డిమాండ్ తగ్గడం. లేదా పరిశ్రమల వస్తువులు, నాణేల తయారీ మందగించడంతో రేట్లు కిందకు దిగి వచ్చాయని అంటున్నారు. బంగారం , వెండి ధరలు ఈరోజు జనాలకు ఊరట కలిగిస్తున్నాయి. దీంతో మార్కెట్ లో డిమాండ్ పెరగడంతో పాటుగా, సంబంధిత ఆభరణాలు, వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి.. మరో 20 రోజుల్లో బంగారం ధరలు 5000 వేలకు పైగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.. మరి ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: