మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..బంగారం ధరలు కిందకు కదిలి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పడిపోతున్న ధరలు ఈరోజు పూర్తిగా కిందకు వచ్చాయి. బంగారం ధర నెల ఆరంభంలోనే పడిపోయింది. నిన్న కాస్త పెరిగింది. ఈరోజు మళ్లీ  పసిడి వెలవెలబోయింది. బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర పడిపోతే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది.. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేటి మార్కెట్ లో మాత్రం భారీగా తగ్గింది. దీంతో కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పడిపోయాయి.. భారతీయ మార్కెట్లో కూడా తగ్గడం విశేషం. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1040 పడిపోయింది. దీంతో రేటు రూ.45,930కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.950 తగ్గుదలతో రూ.42,100కు దిగొచ్చింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గితే , వెండి ధర మాత్రం పరుగులు పెడుతున్నాయి.


కానీ, ఈరోజు వెండి కూడా బంగారం ధరల దారిలోనే నడిచింది.వెండి ధర కేజీకి రూ.1300 పతనమైంది. దీంతో రేటు రూ.72,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. విదేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 1735 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 26.87 డాలర్లకు ఎగసింది. బంగారం ధరలు పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రేపు మహిళలకు ఎలాంటి వార్త వింటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: