మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. నిన్న కాస్త ఉపశమనం ధరలు నేటి మార్కెట్ లో వెల వెల బోయింది.. బంగారం ధరలు పడిపోయాయి. మరోసారి పసిడి ధరలు నేల వైపు చూస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇది ఊరట కలిగించే వార్త అని చెప్పుకోవాలి. శనివారం ఉదయం పసిడి ధరలు మారోసారి తగ్గాయి. మే నెల ప్రారంభంలోనే బంగారం ధరలు తగ్గడం పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పుకోవాలి.. బంగారం ధరలు నేల చూపులు చూస్తే.. వెండి ధరలు మాత్రం ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి..


హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గుదలతో రూ.47,780కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.500 క్షీణతతో రూ.43,800కు పడిపోయింది. ఇక వెండి విషయానికొస్తే.. వెండి ధరలు జిగేల్ మన్నాయి..బంగారం ధర పడిపోతే.. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. వెండి ధర కేజీకి రూ.700 పెరుగుదలతో రూ.74,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు..


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు స్వల్పంగా పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.02 శాతం పెరుగుదలతో 1768 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు మాత్ర పడిపోయింది. ఔన్స్‌కు 0.53 శాతం తగ్గుదలతో 25.91 డాలర్లకు క్షీణించింది.. గతేడాది కరోనా ప్రభావంతో ఆల్ టైం రికార్డ్ కు చేరిన పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. దీంతో బంగారం ప్రియులు మరోసారి పసిడి కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.ఇక అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. మరి రేపటి మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: