
ఆర్థిక నిపుణులు బంగారాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తిగా భావిస్తారు. ప్రతి భారతీయుడికి ఇష్టమైన పెట్టుబడి పసిడి. ఆర్థిక ఇబ్బందుల్లో బంగారం మనిషిని ఆదుకుంటుంది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి బంగారు ధరలు రోలర్ కోస్టర్ రైడ్ లా హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడుతున్నాయి. పెట్టుబడి నిపుణులు, ఫండ్ మేనేజర్లు బంగారు ఆభరణాల కంటే పేపర్ బంగారాన్ని ఎక్కువగా కొంటుంటారు. సావరిన్ గోల్డ్ బాండ్‌లలా కాకుండా మార్కెట్ కదలిక ప్రకారం బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. అది మీకు ఎలాంటి వడ్డీని చెల్లించదు. కాగితపు బంగారు ఆర్‌బిఐ ఎస్‌జిబిలకు మంచి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇది బంగారానికి వడ్డీతో పాటు బహుమతులు కూడా ఇస్తుంది.
ఇంట్లో బంగారంతో ఎలా సంపాదించాలి?
చాలామంది ఇంట్లోనే బంగారాన్ని పెట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది మాత్రం బ్యాంకులలో భద్ర పరుస్తారు. కానీ బంగారం ఇంట్లో ఉన్నా, బ్యాంకులో ఉన్నా అది గుడ్లు పెట్టదు. పైగా బంగారాన్ని బ్యాంకులో భద్రపరచాలనుకుంటే లాకర్ ఛార్జీలను చెల్లించాలి. మీ బంగారాన్ని ఆర్‌బిఐ నియమించిన బ్యాంకులో డిపాజిట్ చేసి దానిపై వడ్డీని పొందవచ్చు. ఈ సదుపాయం ఆర్బీఐ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద అందుబాటులో ఉంది. ఇది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో సమానంగా ఉంటుంది. ఇక్కడ మీరు బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, మెచ్యూరిటీ తర్వాత, మీరు బంగారం లేదా దాని బంగారం విలువకు సమాధానంగా డబ్బును వడ్డీతో సహా తిరిగి పొందుతారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో సహా అనేక బ్యాంకులు ఆర్బిఐ గోల్డ్ మానిటైజేషన్ పథకాన్ని అందిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ "హెచ్డిఎఫ్సి బ్యాంక్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలిక డిపాజిట్‌లపై 2.50%, మీడియం టర్మ్ డిపాజిట్‌లపై 2.25% సంపాదించండి. బంగారం డిపాజిట్ విలువపై వడ్డీ కూడా చెల్లించబడుతుంది" అని వెల్లడించింది.