ఈ మధ్య కాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య బారిన పడి పోతున్నారు . అంతేకాదు అధిక రక్తపోటుకు కూడా గురవుతూ ఉండడం గమనార్హం మరీ ముఖ్యంగా 20 సంవత్సరాలు దాటిన పిల్లల్లో కూడా అధిక రక్తపోటు సమస్య ఎదురవుతోంది. దీనినే హై బిపి అని కూడా అంటారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చాలా మంది హైబీపీకి బలి అవుతున్నారు. ఇకపోతే కొన్ని రకాల హెర్బల్ టీలు తాగితే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మరి హైబీపీని కంట్రోల్ చేసే ఆ హెర్బల్ టీలు ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


గ్రీన్ టీ:
తాజాగా గ్రీన్ టీ ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోవడమే కాదు అధిక బరువు కూడా తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా హైబీపీ కూడా అదుపులో ఉంటుంది. ఇక రెండు రకాల ప్రయోజనాలు ఒకేసారి కలుగుతున్న నేపథ్యంలో మీరు తప్పకుండా ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం తప్పనిసరి గా అలవాటు చేసుకోండి.

మందార టీ:
మందార పువ్వులతో తయారు చేసే టీ తాగడం వల్ల అధిక రక్తపోటు ను అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ టీ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతే కాదు మీరు ఈ టీ తాగాలనుకునేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవడం కూడా తప్పనిసరి.


వెల్లుల్లి టీ:
వెల్లుల్లి తో తయారుచేసిన టీ తాగడం వల్ల కొంచెం ఘాటుగా ఉండడమే కాదు చేదు రుచిని కూడా మీరు ఆస్వాధించాల్సి ఉంటుంది. అయితే వెల్లుల్లి తో తయారుచేసిన టీ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన  కఫమ్ తగ్గడమే కాకుండా హై బిపీ కూడా అదుపులో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: