ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ భారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్న పెద్ద అని తేడ లేకుండా ఈ డయాబెటిస్ అందరికి వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిన వారు ఆ వ్యాధి వల్ల చనిపోయే ప్రమాదం తక్కువ ఉన్నప్పటికీ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ ని కంట్రోల్ చెయ్యాలంటే ఇక్కడ ఉన్న కొన్ని చిట్కాలు పాటించండి. 

                                                            

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని పెద్దలు చెప్తుంటారు.. ఆ మాటలు వింటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయతో అన్ని లాభాలు ఉన్నాయి మరి.. అయితే ఈ ఉల్లిపాయ ఉల్లిరసంతో రక్తంలో డయాబెటిస్ భారీగా తగ్గుతుంది. దాంతో పాటు డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కొవ్వు స్థాయిని కూడా తగ్గిస్తుంది అంటున్నారు ఆరోగ్య పరిశోధకులు. 

                                                                  

యాంటీ బయాటిక్‌ డ్రగ్‌ మెట్‌ఫార్మిన్‌, ఉల్లిపాయ రసాన్ని కలిపి వాడి రక్తంలో డయాబెటిస్ పర్సెంటేజ్ ని తగ్గించొచ్చు. ఇదొక్కటే కాకుండా డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కొవ్వుస్థాయి కూడా భారీగా తగ్గిపోతుందట. అయితే ఉల్లిలో ఉన్న ఏ గుణాల వల్ల రక్తంలో డయాబెటిస్ పర్సెంటేజ్ తగ్గుతున్నాయనే అంశం మీద ఇంకా పరిశోధన చెయ్యాల్సి ఉంది. మరి ఈ పరిశోధన ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: