జలుబు, దగ్గు, తలనొప్పి వంటి  జబ్బులు రాగానే మెడికల్ షాప్ కు పరిగెడుతూ ఉంటాం.  లేదా డాక్టర్ దగ్గరికి పోతాము. ఇలాంటి చిన్న చిన్న జబ్బులను ఇంటి చిట్కాల తోనే  నయం చేసుకోవచ్చు. అలాంటి ఇంటి చిట్కాల గురించి ఇప్పుడూ తెలుసుకుందాం...

 రోజూ ఎనిమిది కరివేపాకులను మిరియాల తో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. అంతేకాకుండా కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ రోజు పది కరివేపాకులతో పేస్టుగా చేసి మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల కాలేయంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది.

 కొన్ని తులసి ఆకులను తీసుకొని కషాయము చేసుకొని తాగడం వల్ల దగ్గు, జలుబు,అస్తమా అదుపులోకి వస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. ఇంకా శ్వాసకోశ వ్యవస్థలో బలోపేతం చేస్తుంది.

 ఈ రోజు మూడు లేదా నాలుగు మెంతి ఆకులను నమిలి చప్పరించడం వల్ల జీర్ణశక్తి పెరిగి, కడుపుబ్బరం, తేన్పులు తగ్గుతాయి. అలాగే శ్వాసకోశ శక్తిని పెంచుతుంది.

 కొంచెం పసుపు తీసుకొని నీటిలో కలుపుకొని ముఖంపై  అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న  తగ్గడమే కాకుండా మచ్చలు కూడా తగ్గుతాయి.

 మందార ఆకుల్ని మెత్తగా నూరి షాంపు  లాగా తలకు పట్టించుకోవడం వల్ల  చుండ్రు  సమస్య తగ్గడమే కాకుండా  తెల్ల వెంట్రుకలు నిరోధిస్తుంది. అంతేకాకుండా ఒక కప్పు నీటిలో మందారం పువ్వు ని వేసి ఆ నీటిని తాగడం వల్ల రక్తంలో ఐరన్ పెరుగుతుంది.

 కలబంద గుజ్జును కాలిన గాయాలపై రాయడంవల్ల గాయాలు తొందరగా మానిపోతాయి. అంతేకాకుండా తలకు అప్లై చేసుకోవడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు చర్మానికి అప్లై చేయడం వల్ల సమస్యలు తగ్గుతాయి.

 గోరింటాకు ను మెత్తగా  నూరి తలంతా అప్లై చేయండి. ఆరిన తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా చుండ్రు  సమస్యను కూడా పోగొడుతుంది. అలాగే జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

 అల్లం రసాన్ని తేనెతో కలిపి  తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఆకలిని పెంచుతుంది. వికారాన్ని కూడా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: