పాలు, పెరుగు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని సంపూర్ణ ఆరోగ్యంగా మన పెద్దలు భావించేవారు.రోజు ఉదయం పూట పెరుగుని తినేవారు. అలా తినటం వల్ల చాలా ఆరోగ్యంగా పుష్టిగా ఉండేవారు మన పెద్దలు. అలా ఎక్కువ సంవత్సరాలు కూడా జీవించేవారు ఆరోజుల్లో.మనమంటే ఈ రోజుల్లో పొద్దున పూట ఇడ్లీ, దోశ అంటూ టిఫెన్లు చేస్తూ ఉంటాము. కాని మన పాత రోజుల్లో పెద్ద వాళ్ళు రోజు పొద్దున పూట పెరగన్నం తినేవారట. అలా తినటం వలన కండరాలు గట్టిపడి బాగా కష్టపడి పని చేసేవారట...రోజుకో గ్లాసు పాలు, కప్పు పెరుగు తింటే మనకు కావాల్సిన ప్రొటీన్ అందుతుంది. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగు అరుగుదల సమస్యను నివారిస్తుంది. శరీరానికి చలవ చేయాలంటే తప్పకుండా పెరుగు తినాల్సిందే. పెరుగు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పాల పదార్థాలు ఎక్కువగా తినేవారికి విటమిన్ బీ12 లభిస్తుంది.పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అందుకే, చాలామందికి మధ్యాహ్నం పెరుగు అన్నం తినదే భోజనం సంపూర్ణం కానట్లు భావిస్తారు.


రోజూ పెరుగు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదేనని వైద్యులు చెబుతున్నారు.ఇక ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగు రాత్రి తింటే మాత్రం జలుబు చేసే అవకాశాలున్నాయి. కాబట్టి, బయట ఉంచే పెరుగు మాత్రమే తినండి.మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతుంటే రాత్రి వేళ పెరుగు అస్సలు తినకూడదు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల గొంతులో కఫం ఏర్పడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.ఒకవేళ మీరు తప్పనిసరిగా పెరుగు తినాల్సి వస్తే.. పలుచని మజ్జిగ తాగండి. రాత్రివేళల్లో పెరుగుతిన్నట్లయితే.. దానికి కాస్త చక్కెర లేదా బ్లాక్ పెప్పర్ కలపండి. అవి పెరుగును సులభంగా అరిగేలా చేస్తాయి. రాత్రి వేళ్లలో వేడి ఆహారంలో పెరుగు వేసుకుని మాత్రం తినొద్దు.రాత్రి పూట తినడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయట. అలాగే చలికాలంలో కూడా పెరుగు ఎక్కువగా తినకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: