మానవ శరీరంలో ప్రతి అవయవం కూడా చాలా విలువైనది.ముఖ్యంగా మూత్రపిండాలు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. మూత్రపిండాలు తమ విధులను సక్రమంగా నిర్వహించక పోతే, ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది.సాధారణంగా ప్రతివారిలోనూ రెండు మూత్రపిండాలు నడుము భాగం లో ఉంటాయి. మూత్రపిండాలు శరీరంలో అధికంగా ఉన్న నీటిని, లవ ణాలను, ఇతర రసాయనాలను మూత్రం రూపంలో వెలుపలికి తీసుకు వెళుతాయి. అలాగే శరీరానికి అవసరమైన నీరు, లవణాలు, ఇతర పదార్థాలు మూత్రం ద్వారా శరీరం కోల్పోకుండా కాపాడు తాయి. మూత్రపిండాలు రక్తంలోని కాల్షియం, సోడియం, భాస్వరం, పొటాషియం వంటి నీరు, భాగాల సమతుల్యతను నిర్వహించడానికి కూడా పనిచేస్తాయి.శరీరంలో ద్రవాలను సరైన స్థాయి లో ఉంచడం, శరీరంలోని రసాయనాల సమతుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరంనుంచి తొలగించడం, వివిధ రకాలైన హార్మోన్ల ను విడుదల చేయడం. ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు తీసుకుంటే, ఎక్కువగా దాహం వేసి నీరు ఎక్కువగా తాగుతాడు.


అటువంటి సమయాలలో మూత్ర పిండాలు అధికంగా ఉన్న ఉప్పును, నీటిని శరీరంనుంచి మూత్రం రూపంలో తొలగిస్తాయి. ఒకవేళ మూత్రపిండాలు సక్రమంగా పని చేయని పక్షంలో ఉప్పు, నీరు శరీరంలో నిలువ ఉండిపోయి, కాళ్లు, చేతులు, ముఖం ఉబ్బుతాయి. మూత్ర పిండాలు రక్తంలోని పొటాషియంను సాధారణ స్థాయిలో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. మూత్రపిండాలు సక్రమంగా పని చేయని పక్షంలో రక్తంలో పొటాషియం స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. ఆ స్థితిలో కండరాలు పని తీరు దెబ్బతింటుంది. మూత్రపిండాలు సక్రమంగా పని చేయకపోతే, ఎర్ర రక్తకణాలు కొద్ది మొత్తంలోనే తయారై, రక్తహీనతకు దారి తీస్తుంది.మూత్రపిండాల్లో ఏ సమస్య వచ్చినా.. ఎన్నోఅనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మూత్రపిండాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారంతోనే మూత్రపిండాలు మరింత మెరుగ్గా పనిచేస్తాయి. శరీరంలో నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. మూత్రపిండాలు దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: