
మునగాకు..
మునగాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల పాలలో కన్నా ఎక్కువ కాల్షియం, మునగాకులో లభిస్తుంది. ఇది ఎముకలు గుల్లబారడం,మోకాళ్ల నొప్పులు,కీళ్ల నొప్పులను దరిచేరకుండా కాపాడుతుంది. అంతేకాక ఇందులో ఉన్న బీటా కెరటిన్, శరీరంలోకి వెళ్లి విటమిన్ ఏ గా మారి, కంటి చూపును మెరుగుపరుస్తుంది. మునగాకులో ఉన్న ఐరన్ కంటెంట్ రక్తహీనతను తగ్గిస్తుంది.
పాలకూర..
పాలకూరను తరచూ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల, శరీరానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా అందుతుంది. అంతేకాక ఇందులో విటమిన్ ఏ, ఐరన్ ఫైబర్ వంటి న్యూట్రియన్స్ అధికంగా ఉంటాయి. న్యూట్రియన్స్ అన్ని జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడి, శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గంగ వాయిలి కూర..
గంగ వాయులకూర పొలాల్లో ఎక్కడపడితే అక్కడ లభిస్తుంది.సాధారణంగా ఎక్కువగా దీనిని గంజిరాకు అని పిలుస్తుంటారు.ఇందులో ఎముకలకు కావాల్సిన క్యాల్షియం, మెగ్నీషియం కూడా అధికమే. దీనిని తరచుగా,మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ఎముకల సమస్యలను నివారిస్తుంది. అంతేకాక ఇందులో ఉండే ఒమెగా-3 యాసిడ్స్ గుండెపోటు, మెదడు సంబందించిన హృద్రోగాలు రాకుండా కాపాడుతుంది.
అంతేకాక పైన చెప్పి ఆకుకూరలన్నీ, రోగనిరోధకశక్తిని పెంచడానికి, రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని వృద్ధి చెందడానికి, కంటిచూపు మెరుగుపరచడానికి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడతాయి. కావున ప్రతిఒక్కరూ తమ రోజువారి ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.