ప్రస్తుతం మనకు మార్కెట్లో దొరకుతున్న రసాయనాలు కలిపిన సాల్ట్ తో ఆరోగ్యానికి చాలా ముప్పు ఉంటుంది. రాళ్ల ఉప్పును సాధారణంగా సముద్రం నుంచి తీసి తయారు చేస్తారు. సముద్రంలోని నీటిని మడుల్లో నిల్వ చేసి ఆ నీరు ఆవిరైన తర్వాత సోడియం క్లోరైడ్ కలిగిన గులాబి రంగు స్పటికలను దానిలో వేసినప్పుడు రాళ్ల ఉప్పు అనేది తయారవుతుంది. ఆయుర్వేదంలో, సేంద నమక్(రాళ్ల ఉప్పు) ను పురాతన కాలం నుండి ఔషధ గుణాలు కలిగిన ఉప్పుగా పరిగణిస్తున్నారు. ఈ రాతి ఉప్పు సాధారణ దగ్గు ఇంకా జలుబును నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఇది కంటి చూపు, జీర్ణక్రియకు కూడా చాలా బాగా సహాయపడుతుంది.ఇందులో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్ వంటి శరీరానికి మేలు చేసే ఇతర ఖనిజాలు ఉన్నాయి. తక్కువ సోడియం కంటెంట్ కారణంగా, సాధారణ ఉప్పు కంటే, రాళ్ళ ఉప్పు శరీరంలో సోడియం కంటెంట్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.


 ఈ సోడియం అనేది అధికంగా ఉన్నా.. లేక తక్కువగా ఉన్నా శరీరానికి చాలా హానికరమే.ఇక దీనిలోని ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా, ఇది కండరాల తిమ్మిరికి ఇంకా మన శరీరంలోని నరాల సరైన పనితీరుకు సహాయపడుతుంది. కానీ, ఎలక్ట్రోలైట్స్ అలాగే కండరాల తిమ్మిరితో వాటి సంబంధం గురించి అధ్యయనాలు కొనసాగుతున్నాయి.ఇక ఆయుర్వేదం ప్రకారం, రాతి ఉప్పు జీర్ణక్రియకు చాలా బాగా సహాయపడుతుంది. మెరుగైన ప్రేగు ఆరోగ్యం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇంకా అలాగే డయేరియా మొదలైన వాటితో పోరాడటానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.ఇంకా చర్మ ఆరోగ్యాన్ని కూడా బాగా మెరుగుపరచడంలో రాతి ఉప్పు చాలా బాగా సహాయపడుతుందని ఆయుర్వేదం సూచిస్తుంది.ఒక్క మాటలో చెప్పాలంటే, రాతి ఉప్పు అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇది శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారం ఔషధ ప్రయోజనాల కోసం ఈ ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: