
చల్లటి పానీయాలు తాగాలని లేదా ఏసీ వాతావరణంలో మజ్జిగ తాగడం మంచిది కాదట. తరచూ మజ్జిగ తాగడం వల్ల పలు రకాల వ్యాధులను నయం చేస్తుంది. మజ్జిగ తాగడం వల్ల ప్రేవులు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మలబద్ధక సమస్య నుండి దూరం చేస్తుంది. ముఖ్యంగా మనిషికి కావాల్సిన నీటి పరిమాణాన్ని కూడా పెంచుతుంది. మజ్జిగలో ముఖ్యంగా పొటాషియం, విటమిన్ -B, విటమిన్ -B12 , క్యాల్షియం ,ఐరన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియా గుణాలతో పాటూ చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ మజ్జిగని ఎక్కువగా తాగితే ఆరోగ్యపరంగా నష్టం కలుగుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
పగటి సమయంలో ఎక్కువగా మజ్జిగ ఏ సమయంలోనైనా సరే తాగవచ్చట. మజ్జిగ తీసుకునే సమయాన్ని బట్టి ప్రయోజనాలు కూడా మారుతూ ఉంటాయని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మజ్జిగ ప్రయోజనాలు మనం తీసుకొని సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి.. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తాగితే ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత మజ్జిగ తాగడం వల్ల కడుపుకు ఎక్కువగా లాభాలు ఉంటాయి. మజ్జిగలో బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ అనేది జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరిచేలా సహాయపడతాయి. ప్రతిరోజు భోజనాంతరం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.