
దాదాపుగా మన పూర్వీకులు కూడా మునగాకును ఒక మెడిసిన్ తయారీలో ఉపయోగించుకునే వారట. అంతేకాకుండా ఆయుర్వేదంలో కూడా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తూ ఉంటారని తెలుస్తోంది. మునగాకులో ఉండే యాసిడ్స్, మినరల్స్ అనేక రకాల వ్యాధులను కూడా నయం చేస్తాయి. పాల నుంచి లభించే కాల్షియం ఈ మునగాకుల చాలా అధికంగా లభిస్తుంది. అలాగే పెరుగు నుంచి లభించే ప్రోటీన్లు కూడా అధిక మొత్తంలో మునగాకుల లభిస్తుందట. మహిళలు బ్లడ్ తక్కువగా ఉన్నవారు ఈ మునగాకు పొడిని ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో తీసుకున్నట్లు అయితే బ్లడ్ శాతం అమాంతం పెరుగుతుందట. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ కూడా తగ్గిపోతోందని ఒక పరిశోధనలో తేలింది.
మునగాకులు ఉండే క్లోరోజనిక్ యాసిడ్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మునగాకు రసం పాలలో కలిపి పిల్లలకు తాపినట్లు అయితే ఎముకలకు చాలా దృఢంగా ఉండేలా చేస్తాయట. బాలింతల కు అవసరమయ్యే క్యాల్షియం ,ఐరన్, విటమిన్లు వంటివి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. పాలిచ్చే తల్లులకు ఎక్కువగా మునగాకు కూరను వండి పెడితే చాలా మంచిది. మునగాకు రసాన్ని కాస్త తీసుకొని కొబ్బరి నీళ్లలో కలిపి తాగినా సరే విరోచనాల నుంచి విముక్తి పొందవచ్చు. మునగాకు రసంలో కాస్త నిమ్మకాయ కలుపుకొని ముఖానికి రాస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.