
తాజాగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఐదు నిండు ప్రాణాలు బలయ్యాయి . ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు నర్స్ తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం కారణంగా స్పాట్ లోనే చనిపోయారు ఐదుగురు పేషెంట్లు . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. ఒడిస్సాలోని కోరాపూట్ జిల్లా కేంద్రంలో గల సాహిత్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది . పూర్తి వివరాల్లోకెళ్తే.. ఒడిస్సా లోని కోరాపూట్ జిల్లా కేంద్రంలో గల సాహిత్ లక్ష్మణ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఐసీయూలో సర్జికల్ వార్డులో చికిత్స పొందుతున్న దాదాపు ఐదుగురు రోగులు నిన్న రాత్రి వేల గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు . దీనికి కారణం నర్సు ఇచ్చిన హైడోస్ ఇంజక్షన్స్ అంటున్నారు మృతుల కుటుంబ సభ్యులు . వీరు మరణించడానికి కొన్ని నిమిషాల ముందు ఆసుపత్రి సిబ్బంది వీరికి రెండో రౌండ్ ఇంజక్షన్లు వేసినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
అప్పటివరకు బాగానే ఉన్నా వాళ్లు ఆ ఇంజక్షన్ వేయగానే చాలా నొప్పితో అల్లాడిపోయారట . "అర్ధరాత్రి సమయంలో ఓ నర్సు వచ్చి మా పక్కన ఉన్న ముగ్గురు రోగులకు ఇంజక్షన్ ఇచ్చారు . అప్పటివరకు బాగానే ఉన్నారు . కానీ ఆ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది . మా సోదరికి కూడా అలాంటి సూది మందే వేశారు . ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఆమె నొప్పితో ఏడ్చేసింది . విలవిలాడిపోయింది . డాక్టర్ చెక్ చేసే లోపే ప్రాణాలు కోల్పోయింది " అంటూ ఓ మృతురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు . చనిపోయిన రోగులంతా ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న వారేనని.. సర్జరీ తర్వాత వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఆనందపడ్డామని . అయితే ఇంతలోపే ఇంజక్షన్ హైడోస్ ఇవ్వడం కారణంగా వాళ్ళు మరణించారు అని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిర్లక్ష్యం వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై పోలీసు కేసు నమోదు చేశారు . ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయఘటనలు జరగకుండా భద్రతను కట్టు తిట్టం చేశారు . పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఘటన పై ఆసుపత్రి యాజమాన్యం ఇంకా అసలు స్పందించకపోవడం అందరికీ కొత్త డౌట్లు కలగజేస్తుంది. అయితే కొంతమంది ఇది పూర్తిగా కావాలని చేసిన పనేనని ఈ మధ్యకాలంలో కొన్ని సో కాల్డ్ హాస్పిటల్స్ ఇలా వైద్యాన్ని వ్యాపారంగా చూస్తూ డబ్బులు గుంచుకోవడానికి ఇలాంటి పనులే చేస్తుంది అని ఘాటు ఘాటుగా మండిపడుతున్నారు..!