మానవుని శరీరంలో జుట్టు అనేది కూడా అందానికి కీలకమని కూడా చెప్పవచ్చు. అయితే కొంతమందికి చిన్న వయసులోనే జుట్టు రంగు అనేది మారుతూ ఉంటుంది. శరీరంలోని పోషకాలు ,విటమిన్ల స్థితిని బట్టి ఈ రంగు మారుతూ ఉంటుందట. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల తెల్ల జుట్టు అనేది ఏర్పడడానికి ముఖ్య కారణం అని నిపుణులు తెలుపుతున్నారు. విటమిన్ B - 12 లోపం వల్లే ఎక్కువగా జరుగుతోందట. ఎర్ర రక్త కణాలు నాడి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరము. విటమిన్ B -12 లోపం వల్ల జుట్టుకు రంగు నిచ్చే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.



ఒకవేళ ఎవరికైనా విటమిన్ B - 12 లోపం ఉన్నట్లుగా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. అందుకు సంబంధించి ఆహార పదార్థాలను ప్రతిరోజు జోడించుకోవడం వల్ల వీటి నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పుట్టగొడుగులు వంటివి తినడం వల్ల బి12 విటమిన్ లభిస్తుంది.


ముఖ్యంగా తెల్ల జుట్టు కనిపిస్తోందని చాలా మంది ఈ మధ్య రసాయనాలతో కూడిన హెయిర్ రంగులను ఉపయోగిస్తూ ఉన్నారు. దీని వల్ల వెంట్రుకలు కూడా చాలా గరుకుగా మారుతాయి. ఆ రసాయనాల వల్ల వెంట్రుకలు కూడా పగిలిపోతాయి. తల కూడా రంగు వేసుకున్న సమయంలో భారంగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ ఎఫెక్ట్ కళ్ళ మీద కూడా చూపిస్తుంది. అందుకే  హెన్నాను ఉపయోగించడం చాలా మంచిది.


విటమిన్ B -12 లోకం వల్లే కాదు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సరైన నీటిని తగిన మోతాదులలో తాగుతూ ఉండాలి. ఒత్తిడి లేకుండా జీవనశైలిని కొనసాగించడం చాలా ముఖ్యము. ఆకుపచ్చ కూరగాయలను, ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తినడం ,పండ్లను తినడం చాలా మంచిది. సహజమైన జుట్టు రంగును కాపాడుకోవడానికి తగినన్ని పోషకాలు ఉన్న వాటిని తినడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: