క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 15 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


ప్రముఖుల జననాలు:



1803: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (మ.1899)



1817: దేబేంద్రనాథ్ ఠాగూర్, భారతీయ తత్వవేత్త మరియు రచయిత (మ .1955)



1907: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు (మ,1931)



1908: వింజమూరి శివరామారావు, తెలుగు కవి. (మ.1982)



1915: పాల్ సామ్యూల్‌సన్, ఆర్థికవేత్త (మ.2009)



1926: నూతి విశ్వామిత్ర, ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు



1938: కె.జమునారాణి, సుప్రసిద్ధ తెలుగు సినిమా గాయకురాలు.



1964: జి.కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.






1968: స్రవంతి ఐతరాజు, కవి, మనస్తత్వవేత్త



1987: రామ్, తెలుగు సినిమా హీరో.



ప్రముఖుల మరణాలు:



1994: ఓం అగర్వాల్, భారత స్నూకర్ క్రీడాకారుడు.



2010: భైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి (జ.1923)



2014: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)



సంఘటనలు:


1618: గ్రహాల కదలిక యొక్క మూడవ సూత్రాన్ని తాను తిరస్కరించినట్లు జోహన్నెస్ కెప్లర్ ధృవీకరించాడు. అతను మొదట దీనిని మార్చి 8 న కనుగొన్నాడు, కాని కొన్ని లెక్కలు చేసిన వెంటనే ఈ ఆలోచనను తిరస్కరించాడు.


1952: భారత లోక్‌సభ స్పీకర్‌గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.



1989: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.



1991 - ఎడిత్ క్రెసన్ ఫ్రాన్స్ యొక్క మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు.



2013: ఇరాక్‌లో హింసాకాండ పెరగడంతో మూడు రోజుల్లో 389 మందికి పైగా మరణించారు.



పండుగలు, జాతీయ దినాలు



అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి: