ఒక‌ప్ప‌టితో పోలిస్తే నేడు పిల్ల‌ల పెంప‌కం అనేది పూర్తిగా మారిపోయింది. పిల్ల‌ల‌ను చాలా గారాభంగా పెంచుతున్నాం. వారికి ఏమి కావాల‌న్నా క్ష‌ణాల్లో స‌మ‌కూర్చిపెడుతున్నాం. స్తోమ‌త లేక‌పోయినా అడిగిన‌వ‌న్నీ కొనిపెడుతున్నాం. ఇక పిల్ల‌ల చ‌దువులు, స్కూళ్ళు, మార్కుల గురించి పూర్తి శ్ర‌ద్ధ తీసుకుంటున్నాం. ఇక ఈ ర‌క‌మైన పెంప‌కాన్ని డాక్ట‌ర్లు హెలీకాప్ట‌ర్ పేరెంటింగ్ అని పిలుస్తారు. నిజానికి ఈ ర‌క‌మైన పెంప‌కానికి పిల్ల‌ల అవ‌రోధానికి అవ‌కాశంగా మారుతుందంటున్నారు. కోడిపిల్ల క‌ష్ట‌ప‌డ‌కుండా బ‌య‌ట‌కు రావాల‌ని మ‌న‌మే ప‌గ‌ల‌గొడితే ఏంజ‌రుగుద్ది.. అలాగే మొక్క కూడా విత్త‌నం నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి విత్త‌నాన్ని మ‌న‌మే చీలిస్తే జ‌రిగేదేమిటి..

 

ఈ ప్ర‌శ్న‌లు వింటేనే ఆశ్చ‌ర్య‌మేస్తుందా నిజ‌మే ఎందుకంటే ప్ర‌స్తుతం ఎంతోమంది త‌ల్లిదండ్రుల వ్య‌వ‌హార శైలి ఇలాగే ఉంటుంది. త‌మ పిల్ల‌ల ఎక్క‌డా క‌ష్ట‌ప‌డకూడ‌దని క‌ళ్ళ‌న్నీ వాళ్ళ మీదే పెట్టుకుని వాళ్ళ‌కి ఏక‌ష్టం క‌లిగినా రెక్క‌లు క‌ట్టుకుని అక్కడే వాలిపోతున్నారు. ఆ స‌మ‌స్య‌ల్ని వాళ్ళే ప‌రీక్షించేస్తున్నారు. పిల్ల‌ల‌ను వెన్నెంటే ఉంటూ హెలీకాప్ట‌ర్‌లా వాళ్ళ తల్లిదండ్రులు ఇటీవ‌ల కాలంలో పెరిగిపోతున్నార‌ని దీని వ‌ల్ల పిల్ల‌లకు మేలు జ‌ర‌గ‌క‌పోగా వారి భ‌విష్య‌త్తు మ‌రింత అగ‌మంగా జ‌రుగుతోంద‌ని నిపుణులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాక ఈ ర‌క‌మైన పెంప‌కానికి ప్ర‌త్యేకంగా హెలికాప్ట‌ర్ పేరెంటింగ్ అని పేరు పెట్టి మ‌రి విశ్లేషిస్తున్నారు. పిల్ల‌లు ఎంత పెద్ద‌గా అయినా కూడా ఎప్పుడూ త‌ల్లిదండ్రులు వారి మీద సిఐడి ప‌నులు చేస్తుంటారు.

 

అంటే ఎక్క‌డ‌కి వెళుతున్నారో వెళ్ళి చూడ‌డం. స్కూల్లో ఏం చేస్తున్నారో, కాలేజ్‌లో ఏమిచేస్తున్నారో ఎక్క‌డెక్క‌డ తిరుగుతున్నారో...వాళ్ళ టీచ‌ర్‌తో మాట్లాడ‌టం ఇలా ఎప్పుడూ వెంట వెంట ఉండి ఓవ‌ర్ ప్రొటెక్ష‌న్ క‌ల్పించి మాలాంటి త‌ల్లిదండ్రులు లేరు పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటాం అనే ఉద్దేశ్యంతో ఒక ఉదార స్వ‌భావం ఉంటే ఉండొచ్చు దాని వ‌ల్ల పిల్ల‌ల వ్య‌క్తిత్వం ఎంత దెబ్బ‌తింటుంది అన్న సోయ మాత్రం త‌ల్లిదండ్రుల‌కు ఉండ‌డం లేదు. అంటే పిల్ల‌ల‌కు స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణాన్ని క‌లిగిస్తే వాళ్ళు అతి ఉన్న‌త‌మైన వ్య‌క్తిత్వానికి సోపాయ‌నం అవుతారు. ఇక యుక్త‌వ‌య‌సులో ఉన్న పిల్ల‌ల‌కు ఇండివిడ్యువాలిటీ అనేది ఉంటుంది. మేము మ‌నుషుల‌మే నువు చెపితే మేము వినాలా అనే ధోర‌ణి చివ‌రికి వాళ్ళ‌కు వ‌చ్చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: