మామూలుగా ఈరోజుల్లో పుస్తకాలు చదవాలంటేనే పిల్లలకు బోర్ కొట్టేస్తుంది. మొబైల్ ఫోన్లో చూడ్డానికి ఉన్న ఇంట్రెస్ట్ పుస్తకాలు చదవడానికి ఉండడం లేదు. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో గల సిలిగురిలో ఉండే దక్ష్ అనే ఒక పదకొండేళ్ల కుర్రాడు ఏకంగా కళ్ళు మూసుకొని పుస్తకాన్ని గడగడ అప్పచెప్పేస్తున్నాడు. చిన్నతనంలో దక్ష్ కి  మాటలు రాకపోవడం, వచ్చిన తడబడటం, జ్ఞాపకశక్తి లేకపోవడం వంటి కొన్ని సమస్యలు ఉండేవి. పరీక్షల్లో మార్కులు బాగానే తెచ్చుకునే వాడు కానీ అవి జ్ఞాపకం ఉండేవి కాదు. తనలోని లోపాలను గమనించిన అతడి తల్లి అర్చన సింగ్ తనకి కొన్ని ట్రీట్మెంట్స్ తో పాటు సంస్కృతం కూడా నేర్పించింది. దాంతో ధక్ష్ లో విపరీతమైన జ్ఞాపకశక్తి పెరిగిపోయింది.

చరిత్రలోకి వెళ్తే కవి సూరదాసు సైతం కంటి చూపు లేకపోయినా కవిగా, రచయిత గా , మంచి గాయకుడిగా పేరు గడించినట్టే ఇప్పుడు దక్ష్ సైతం తన అసమాన ప్రతిభ తో అంతటి కవి ని గుర్తుకు తెస్తున్నాడు. స్వతహాగా దక్ష్ తల్లి న్యూరో-లింగ్విస్టిక్ ప్రాక్టీషనర్‌. దాంతో కొడుకులో లోపాలను సవరించాలని అనుకుంది.  ఈ రోజు తన కొడుకు ఇంత మేధావంతుడు కావడానికి ఆమె కారణం. ప్రస్తుతం దక్ష్ తన మేధస్సు తో పేరు ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఒక్క నిముషం లో కళ్ళు మూసుకొని ఎన్నో అంకెలను, విభాగాలను, లెక్కలను, సంఖ్యలు చెప్పగలడు. కళ్ళు మూసుకొని పాఠ్య పుస్తకాలను చదవగలడు.

ఇవే కాకుండా ధ్యానం కూడా ప్రతి రోజు తప్పకుండ చేసే దక్ష్ మ్యూజిక్ హీలింగ్ థెరపీ కూడా చేయించుకున్నాడు. అందుకే అతడి మెదడు లోని పినీయర్ గ్రంధి హార్మోన్స్ ని విడుదల చేసి తన శరీరం లో ఉండే అన్ని భాగాలూ బాగా పని చేసేలా ఉత్తేజ పరిచాయి . ఈ కారణం గానే దక్ష్ అలవోకగా కళ్ళు మూసుకొని ఎవరికీ సాధ్యం కానీ పాఠ్య పుస్తకాలను కేవలం నిముషం వ్యవధి లో చదువుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Eys