ఇండియన్ బోల్డ్ బ్యూటీలలో రాధిక ఆప్టే ఒకరు.. ఈ హీరోయిన్ నార్త్,సౌత్ లో ఎన్నో బోల్డ్ పాత్రలు పోషించింది. అంతేకాదు పాత్ర డిమాండ్ చేస్తే పూర్తిగా బట్టలు లేకుండా నగ్నంగా నటించడానికి కూడా రెడీగా ఉంటుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గతంలో నుండి ఓ తెలుగు హీరో పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తెలుగులో  ఈ హీరోయిన్ లయన్,లెజెండ్, రక్త చరిత్ర,రక్త చరిత్ర 2, ధోని, కబాలి వంటి సినిమాల్లో నటించింది. అలాగే బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేసింది.

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీలో చేసిన సమయంలో ఓ తెలుగు హీరో కారణంగా ఇబ్బందులు ఫేస్ చేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతే కాదు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే ఓ తెలుగు హీరో నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నీచమైన మాటలు మాట్లాడారు అంటూ సంచలనం వ్యాఖ్యలు చేసింది.మరి ఇంతకీ రాధిక ఆప్టే ఏం మాట్లాడింది అనేది చూస్తే.. నేను సౌత్ లో సినిమా చేస్తున్నప్పుడు ఒక తెలుగు హీరోతో ఎలివేటర్ లో వెళ్తున్నాను. ఆ సమయంలో నా పక్కన ఎవరూ లేరని చూసినా ఆ తెలుగు హీరో నా వైపు వచ్చి కాస్త చనువుగా మాట్లాడారు. అయితే మొదట ఆయన మాటలు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత అసభ్యంగా మాట్లాడారు.

రాత్రి సమయంలో మీ బ్యాక్ దురద పెడితే నన్ను పిలవండి నేను వచ్చే రుద్ది పెడతాను అంటూ చాలా నీచంగా మాట్లాడారు. ఇక ఆ హీరో మాటలకి ఒక్కసారిగా నేను షాక్ అయిపోయి వాట్ అంటూ గట్టిగా అరిచేసరికి ఆ హీరో నా కోపానికి సైలెంట్ అయిపోయారు. ఆ సమయంలో ఆ హీరో మాట్లాడిన నీచపు మాటలకి నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంది. ఆ మాటలు మాట్లాడిన సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను.కానీ అప్పుడు నేను ఇచ్చిన వార్నింగ్ తో ఆ హీరో నా వైపు మళ్ళీ కన్నెత్తి చూడలేదు అంటూ తనకి ఎదురైనా చేదు అనుభవాన్ని బయటపెట్టింది నటి రాధిక ఆప్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: