డబ్బు మనకు నిత్యావసరం. ఈ రోజుల్లో డబ్బు లేని వాడు డుబ్బుకు కొరగాడు అంటారు. అందుకే డబ్బును ఖర్చు చేసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. అలాగని మరీ పిసినారిగా ఉండక్కర్లేదు. సొంత లాభం కొంత మానుకో.. పొరుగు వాడికి తోడుపడాలని కూడా మన పెద్దలు చెప్పారు.

 

 

అందుకే డబ్బుతో మనం అవసరాలు తీర్చుకోవడమే కాదు.. కష్టాల్లో ఉన్నవారినీ ఆదుకోవాలి. అయితే దానానికీ కొన్ని నియమాలు ఏర్పరచారు మన పూర్వులు. పాత్రత ఎరిగి దానం చెయ్యమన్నారు. మంచి నేలలో నాటిన గింజలు ఫలించి సస్యాలవుతాయి. చవిటి నేలలో వేసిన బీజాలు నశిస్తాయి.

 

 

అపాత్రదానం గాని, స్థోమతకు మించిన దానాలుకాని చేయకూడదు. పాత్రత అంటే యోగ్యత. ధర్మజ్ఞుడైన వాడికి చేసే దానం ఉత్తమం. దాన గ్రహీత స్వీకరించిన దాన్ని ధర్మకార్యాలకే వెచ్చిస్తాడు. కార్య పాత్రమంటే తగినపని. మంచిపనులకు అంటే ఒక దేవాలయం, విద్యాలయం, శరణాలయం వంటివాటి ఏర్పాటుకు దానంచెయ్యడం.

 

 

మూడోది కామపాత్రం. కామమంటే కోరిక. యాచకుడు పేదరికంతో తన మనుగడకోసం బతుకు తెరువుకోసం అన్నమో, ధనమో, వస్త్రమో, భూములో కోరతాడు. వాడి స్థితినిబట్టి, అవసరాన్నిబట్టి యోగ్యత నిర్ణయించాలి. మరో విషయం అన్యాయంగా సంపాదించిన డబ్బు దానం చెయ్యడంవల్ల ఫలం లేదు. ధర్మంగా కష్టించి సంపాదించినదాంట్లో కొంచెమైనా సమాజ క్షేమానికి వ్యయం చేయడం మేలైన పని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: