సాధారణంగా పురుషుల్లో కన్నా మహిళలో మూత్రనాళ ఇన్ఫెక్షన్ లకు ఎక్కువగా గురవుతూ ఉంటారు.మూత్రకోశ మార్గాలలో వచ్చే ఇన్ఫెక్షన్ చాలా ప్రమాదకరం.కిడ్నీస్,మూత్రాశయం,యూరిన్ బ్లాడర్ , మూత్రం వెలుపలికి వచ్చే మార్గము వంటివన్నీ కలిపి మూత్ర వ్యవస్థ అంటారు.ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే మానవ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వ్యవస్థ నుంచే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి పంపించబడతాయి.మూత్రవ్యవస్థలో ఈ లక్షణాలు కనిపిస్తే మూత్రనాల ఇన్ఫెక్షన్లు వస్తాయని సూచనగా తీసుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

1.యూరిన్ చేసే సమయంలో మండుతున్నట్టు అనిపించడం.
2. సిస్టిటిస్ (Cystitis) అనే ఇన్ఫెక్షన్ వల్ల మాటి మాటికీ యూరిన్ కి వెళ్ళాలి అనిపించడం. మరియు మూత్ర విసర్జనకి వెళ్తే కొంచెం కొంచెం విసర్జించడం.
3. యూరిన్ కి వెళ్ళనప్పుడు మూత్రం నల్లగా, రక్తంతో కూడినదై, వాసనతో కూడి మబ్బుగా ఉండడం.
4.పైలోనెఫ్రిటిస్ (Pyelonephritis) అనే యూరిన్ ఇన్ఫెక్షన్ అయి మాటి మాటికీ చలి, జ్వరం రావడం.
5.వెన్నుముక లేదా పొత్తికడుపు క్రింద భాగంలో ఒక రకమైన నొప్పీ రావడం, వాంతులు, కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి.


1).మూత్రనాళా ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు..
మహిళలు బాత్రూమ్‌నకు వెళ్లిన సమయాలలో ముందు మరియు వెనుక భాగాలలో పూర్తిగా శుభ్రం సరిగ్గా చేసుకోకపోవడం,ఆఫీస్, స్కూల్ వంటి ప్రాంతాల్లో ఒకే చోట ఎక్కువ మంది మూత్రవిసర్జన వెళ్లడం, బాత్రూం శుభ్రంగా ఉంచుకోకపోవడం, లైంగికంగా భార్య భర్తలు కలిసిన తర్వాత సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, నీరు సరైనా క్రమంలో తీసుకోకపోవడం, జన్యుక్రమ లోపాలు వంటివి ముఖ్యమైన కారణాలుగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2).మూత్రనాళ ఇన్ఫెక్షన్ రాకుండా నివారణ చర్యలు
1.మూత్రవిసర్జన చేసే సమయంలో మూత్రాన్ని పూర్తిగా, తొందరగా విసర్జించే ప్రయత్నం చేయాలి.
2.యూరిన్ కి వెళ్లిన ప్రతిసారి ముందు, వెనుక భాగాలలో శుభ్రం చేసుకోవాలి, కెమికల్ ఉత్పత్తులు వాడకూడదు.
3. ఎక్కువగా నీరు తీసుకోవడం
4.లైంగికచర్యలో పాల్గొనే ముందు మరియు తర్వాత లైంగిక అవయవాలను శుభ్రం చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: