
అధిక బ్లీడింగ్ అయేవారికి..
ఇంగువ, వెల్లుల్లి, అల్లం, మామూలుగా తీసుకోవచ్చు. ఇంగువ మైల రక్తం త్వరగా విడుదలయ్యేందుకు సహాయపడుతుంది. డెలివరీ అయినా తర్వాత ఇరవై రోజుల పాటు ఒంటి భోజనం మంచిది. చల్లని వాటిని తాకకపోవడం ఉత్తమం. ప్రసవించిన ఓ వారం తరువాత మాంసం కూడా తినవచ్చు.నల్లనువ్వులను కానీ ఉలవలను వేయించి పొడిచేసి తగిన మోతాదులో తీసుకుంటే తల్లి పాలు పెరుగుతాయి. ఇక చేపలు వంటి ఆహారాలకు 6 నెలలపాటు వీటికి దూరంగా ఉండాలి.పచ్చిబాలింత పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. అస్వగంధచూర్ణం మోతాదులో తీసుకుని పాలలో కలిపి రెండు పూటలా తాగాలి. వాము మరియు జీలకర్ర రెండింటినీ వేయించి పొడిచేసి , పాలల్లో వేసి బాగా ఉడికించి, ఆ పాలను తాగితే బాలింతలకు చాలా మంచిది. గర్భవతులకు చలవ కలిగించడానికి తరుబూజ పండు గుజ్జులో పంచదార వేసి తినిపించవచ్చు. సగ్గుబియ్యం జావ, బార్లీ జావ, కొబ్బరి నీళ్ళు వంటివి ఇస్తే శక్తి లభిస్తుంది.సాంబ్రాణి, గుగ్గిలం కలిపి దుపమ్ బిడ్డకు వేస్తువుంటే జలుబు వంటివి దరిచేరవు .ప్రత్తిగింజ లోపలి పప్పులను తీసుకొని వేయించి, మెత్తగా దంచి ఉప్పుకారం కలుపుకుని అన్నంలో తినడంవల్ల తల్లిపాలు వృద్ధి చెందుతాయి. లేకుంటే అ పొడిని నేరుగా పాలలో కలుపుకుని తాగవచ్చు. బొప్పాయి, లేత మునగాకులతో కూర వండి పెడితే బాలింతలకు పెట్టడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.