ఈ మధ్యకాలంలో ఊపిరితిత్తులలో న్యూమోనియా సమస్య చాలామందిని బాధిస్తోంది.ఇది సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా,ఫంగస్ వంటి మైక్రోబ్స్ వల్ల ఊపిరితిత్తుల్లో కలిగే వ్యాధి.ఈ వ్యాధి వచ్చినవారికి విపరీతమైన దగ్గు,జలుబు, జ్వరం,పచ్చగా కఫం పడటం వంటివి జరుగుతుంటాయి.న్యూమోనియా ఊపిరితిత్తులలోని గాలితీత్తులు సరిగా పనిచేయక పోవడం వల్ల కలుగుతుంది. మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వేరు చేయడం అనేది ఈ గాలి తిత్తుల్లోనే జరుగుతుంది. ఈ గాలితిత్తులను వైరస్ ఫంగస్ బ్యాక్టీరియా వంటివి సమీపించడం వల్ల,వాటిలో జిగురు వంటి పదార్థం ఏర్పడి, గాలిని సరిగా డివైడ్ చేయదు. అందులో జిగురువంటి పదార్థం పసుపు పచ్చగా కఫం లాగా మారుతుంది. అది ఊపిరితిత్తుల్లో నెమ్ముగా ఏర్పడుతుంది. దీనినే న్యూమోనియా అంటారు.

ఈ న్యూమోనియా ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారికి, రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి, పొగ త్రాగేవారికి ఎక్కువగా సోకుతూ ఉంటుంది. గుండెల్లో మంట, ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన జ్వరం వస్తుంటాయి. న్యూమోనీయను తగ్గించుకోవడానికి,లేదా రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

 రోగనిరోధకశక్తిని పెంచుకోవడం..
శరీరంలో రోగాలు కలిగించే మైక్రోబ్స్ తో పోరాడడానికి మనకు రోగనిరోధక శక్తి చాలా అవసరం.రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, ఉదయం ఎండలో సూర్య రష్మి తగిలేలా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను మన డైట్ లో తీసుకోవడం చాలా ఉత్తమం.

పొగ తాగడం మానివేయడం..
న్యూమోనియాను తగ్గించడానికి పొగ తాగడం మానే పూర్తిగా మానివేయాలి.దీనితో ఊపిరితిత్తుల్లో కలిగే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

వ్యాక్సిన్ వేయించుకోవడం..
న్యూమోనికల్ వ్యాక్సిన్ వేయించికోవడం వల్ల న్యుమోనియాను నివారించడంలో సహాయపడుతుంది బలహీనమైన రోగనిరోధకశక్తి లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, మూత్రపిండాలు,గుండె సమస్యలను తగ్గిస్తుంది.

 ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ ..
న్యుమోనియా అనేది ఫ్లూ కలిగించే సమస్య.కావున దీనిని తగ్గించుకోవడానికి ప్రతి సంవత్సరం ఫ్లూ టీకాను తప్పకుండా పొందండం చాలా అవసరం.

మీ చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా పరిశుభ్రతను పాటించడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: