
అదే ఎక్కడికైనా బయటికి వెళ్లాల్సి వస్తే ఇక వారం రోజుల పాటు స్కూల్ కి సెలవు పెట్టేయాలి అని చిన్నారులు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక చిన్నారి మాత్రం అలా చేయలేదు. ఒక్కరోజు కూడా స్కూల్ డుమ్మ కొట్టకుండా వెళ్ళింది అందులో కొత్తేముంది ఎంతోమంది పిల్లలు ఇలా స్కూలు డుమ్మా కొట్టకుండా వెళ్తారు. దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ ఓ చిన్నారి స్కూల్ కి డుమ్మా కొట్టకుండా ఒక పెద్ద ఘనతను సాధించింది. ఒక్కరోజు కూడా స్కూల్ కు డుమ్మా కొట్టకుండా 50 దేశాలని చుట్టేస్తుంది చిన్నారి.
లండన్ లో ఉంటున్న భారత సంతతికి చెందిన అదితి అనే పదేళ్ల బాలిక స్కూలుకు సెలవు పెట్టకుండా 50 దేశాలని చుట్టేసింది అదెలాగా అనుకుంటున్నారా శుక్రవారం సాయంత్రం స్కూల్ నుండి నేరుగా పర్యటనకు వెళుతూ ఉండేది ఆ చిన్నారి. అంతే కాదు సండే నైట్ 11 గంటలకల్లా మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఇక టూర్ ప్లాన్ చేసుకునేది. ఈ క్రమంలోనే ఐరోపా దేశాలలో సహా అటు భారత్, నేపాల్, థాయిలాండ్, సింగపూర్ లాంటి దేశాలను కూడా సందర్శించింది సదరు చిన్నారి. ఇలా ఈ చిన్నారి విదేశీ పర్యటనలకు దాదాపు 21 లక్షల వరకు ఖర్చయిందని తల్లిదండ్రులు తెలిపారు.